RRR Promotions: దర్శక దిగ్గజం జక్కన్న.. ఓ ఆట ఆడేసుకున్న హీరోలు!

ఓ టాప్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు.. 400 కోట్లకు పైగా బడ్జెట్..1000 రోజుల షూటింగ్.. అంతకుమించి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన భారీ సినిమా. ఇదీ ట్రిపుల్ ఆర్ ఓవరాల్ సినారియో.

RRR Promotions: దర్శక దిగ్గజం జక్కన్న.. ఓ ఆట ఆడేసుకున్న హీరోలు!

Rrr Promotions

RRR Promotions: ఓ టాప్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు.. 400 కోట్లకు పైగా బడ్జెట్..1000 రోజుల షూటింగ్.. అంతకుమించి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన భారీ సినిమా. ఇదీ ట్రిపుల్ ఆర్ ఓవరాల్ సినారియో. కానీ హీరోల మధ్య నాటీ ఫైట్లు, హీరోయిన్ ని ఆటపట్టించిన హీరోలు, రాజమౌళితో ఆడుకున్న స్టార్లు.. షూటింగ్ లో ఏడిపించుకు తిన్న యాక్టర్లు.. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబందించి మరో యాంగిల్ కూడా ఉందని ప్రమోషన్ కార్యక్రమాలతో బయటపడింది.

Allu Arjun: వాట్ నెక్స్ట్.. బన్నీ తర్వాత సినిమా ఎప్పుడో?

ట్రిపుల్ఆర్ మూవీ టాలీవుడ్ టాప్ హీరోలతో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో ఎమోషనల్ డ్రామాగా 450 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా షూటింగ్, ఫిజికల్ గా, మెంటల్ గా చాలా కష్టపడి జనవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు టీమ్. కానీ అసలు షూటింగ్ ఎలా జరిగిందో, ఎంత సరదాగా టైమ్ స్పెండ్ చేశారో రివీల్ చేస్తున్నారు టీమ్. ఓ స్టార్ డైరెక్టర్ ని సినిమాల్లో ఎప్పుడూ మాస్, సీరియస్ క్యారెక్టర్స్ చేసే ఎన్టీఆర్ ఇంతలా ఆటపట్టించారు. వీళ్ల అల్లరికి షూటింగ్ టైమ్ వేస్టయిపోయిందని రాజమౌళి పబ్లిక్ గా కంప్లెంయింట్ చేస్తుంటే.. మరి స్టార్ హీరోలు ఊరికే ఉంటారా?

RRR OTT: క్రేజీ అప్డేట్.. ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ!

షూటింగ్ టైమ్ లో రాజమౌళి వీళ్లని ఎంత ఏడిపించారో అంతే ఓపెన్ గా చెప్పారు హీరోలు. ఒక్క షాట్ కోసం రోజు రోజులు పని చేయిస్తాడని రాజమౌళిని ఓ ఆటఆడుకున్నారు చరణ్, తారక్. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అంటే ఓకే ముగ్గురూ ఒకే ఇండస్ట్రీకి చెందినవాళ్లు. ఒకరితో ఒకరు కలిసి సినిమాలు చేశారు కాబట్టి మంచి రాపో ఉంది. కానీ ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ని కూడా అంతే ఆటపట్టించారు ఈ స్టార్ హీరోలు. ఈ సినిమా కోసం రాజమౌళి ప్రతి డీటెయిల్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంత కమిటెడ్ గా సినిమా చేశారో ఫన్నీగా షేర్ చేసుకున్నారు టీమ్.