RRR: చౌరస్తాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఇప్పట్లో కష్టమే!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేయగా...

RRR: చౌరస్తాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఇప్పట్లో కష్టమే!

RRR

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేయగా, అన్ని చోట్లా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ జనం ఈ సినిమాకు ఫిదా అయ్యారు.

RRR: 31 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో ఆర్ఆర్ఆర్!

ఇక బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ రికార్డు వసూళ్లతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా రూ.1100+ కోట్ల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తా చాటింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే నైజాం ప్రాంతంలో ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలవగా.. తాజాగా ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ప్రభంజనం సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఆర్ఆర్ఆర్ ఏకంగా రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఇక్కడ 4,5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఏకైక సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

RRR: ఆర్ఆర్ఆర్ నుండి రేపు మరో సర్‌ప్రైజ్!

గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రూ.3.76 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో తన రికార్డును తానే బద్దలుకొట్టాడు ఈ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ నెలకొల్పిన ఈ రికార్డును ఇప్పట్లో ఏ సినిమా కూడా తిరగరాయడం కష్టమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.