RRR : ఢిల్లీ ఏపీ భవన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా స్పెషల్ షో వేయనున్నారు. ఆంధప్రదేశ్ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు, రేపు రోజుకు మూడు షోలు 'ఆర్ఆర్ఆర్' సినిమాని...........

RRR : ఢిల్లీ ఏపీ భవన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోలు

Delhi

RRR :  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న మార్చ్ 25న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రేక్షకులు, అభిమానుల హంగామాలు మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. వీకెండ్ కావడంతో దేశ వ్యాప్తంగా రేపటి వరకు కూడా అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.

Vikram : కమల్ హాసన్ సినిమాలో అమితాబ్??

ఇక సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాపై, రాజమౌళి, తారక్, చెర్రీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులు సినిమా హిట్ అయినందుకు సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల స్పెషల్ షోలు వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్పెషల్ షో వేయనున్నారు. ఆంధప్రదేశ్ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు, రేపు రోజుకు మూడు షోలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రదర్శించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఢిల్లీలో ఉండే తెలుగు ప్రజలు ఈ స్పెషల్ షోస్ కి వెళ్లనున్నారు.