Movie Collections: 1000 కోట్ల క్లబ్.. మళ్ళీ రిపీట్ చేసే స్టార్స్ ఎవరో?

మొన్నటివరకు 100 కోట్ల క్లబ్ లో చేరితేనే ఓ స్పెషల్ రికార్డ్. కానీ ఇప్పుడు లెవెల్ మారింది. బడ్జెట్ పెరిగింది. టార్గెట్ పాన్ ఇండియా అయింది. సో ఇప్పుడు 1000 కోట్లు రాబట్టాడంటే ఆ హీరో తోపు కింద లెక్క.

Movie Collections: 1000 కోట్ల క్లబ్.. మళ్ళీ రిపీట్ చేసే స్టార్స్ ఎవరో?

Movie Collections

Movie Collections: మొన్నటివరకు 100 కోట్ల క్లబ్ లో చేరితేనే ఓ స్పెషల్ రికార్డ్. కానీ ఇప్పుడు లెవెల్ మారింది. బడ్జెట్ పెరిగింది. టార్గెట్ పాన్ ఇండియా అయింది. సో ఇప్పుడు 1000 కోట్లు రాబట్టాడంటే ఆ హీరో తోపు కింద లెక్క. కొన్నేళ్ల వరకు ఒక్క బాలీవుడ్ స్టార్ మాత్రమే ఈ రేర్ ఫీట్ సాధించిన స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు. కానీ రాను రాను ఒక్కొక్కరుగా ఆ క్రేజీ క్లబ్ లోకి మన సౌత్ హీరోలు ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడి వారికి మాంచి కిక్ ఇస్తోన్న ఆ సౌత్ థౌసండ్ క్రోర్ స్టార్స్ ఎవరో ఓసారి చూసేద్దాం.

Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

50 కోట్లు.. 100 కోట్లు.. 500.. ఇప్పుడు 1000.. నెక్ట్స్ టార్గెట్ 2వేల కోట్లే. నిజానికి 1000 కోట్లు రాబట్టడమంటే కూడా ప్రస్తుతమంతా తేలికైన విషయం కాదు. పాన్ ఇండియా లెవెల్ లో ఓ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తేనే.. రిపీట్ మోడ్ లో జనాలు థియేటర్ కొస్తేనే అది సాధ్యమయ్యే విషయం. అయితే ఇలాంటి కష్టమైన ఫీట్ ను మన సౌత్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు చేరుకుంటున్నారు. 1000 కోట్ల క్లబ్ లో చేరి నేషనల్ లెవెల్ లో ఫోజులు కొడుతున్నారు. రీసెంట్ గా కె.జి.యఫ్2తో రాకింగ్ స్టార్ యశ్ ఈ రికార్డ్ ను కొల్లగొట్టి అదీ లెక్క అనిపించాడు.

Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..

బాహుబలి 2తో ప్రభాస్ మొదట 1000 కోట్ల క్లబ్ లోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చారు. సౌత్ సత్తాను గ్లోబల్ బాక్సాఫీస్ ముందు చూపించారు. బాహుబలితో ఇండియా వైడ్ పేరుతెచ్చుకున్న డార్లింగ్.. బాహుబలి2తో ఒక్కసారిగా వాంటెండ్ స్టార్ అయ్యారు. రాజమౌళి విజన్, రానా విలనిజం, కట్టప్ప సీక్రెట్.. అన్నింటికి మించి రెబల్ స్టార్ కటౌట్ బాహుబలి2ను బర్నింగ్ టాపిక్ గా మార్చేసింది. 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి హీరోగా అరుదైన గుర్తింపు ప్రభాస్ కు దక్కింది.

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

ప్రభాస్ తర్వాతి ప్లేస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 1000 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకున్నారు. నిజానికి బాహుబలి 2 కన్నా ముందే 2016లో దంగల్ రిలీజైంది. కానీ 2017లో చైనాలో రిలీజయ్యాకే 2వేల కోట్ల మైల్ స్టోన్ ను దంగల్ రీచయింది. సో అంతకుముందు పీకే లాంటి సినిమాలతో 8వందల కోట్ల వరకు సాధించిన ఆమిర్.. 1000 కోట్లను టచ్ చేసింది మాత్రం సౌత్ స్టార్ ప్రభాస్ తర్వాతే.

Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!

ప్రభాస్, ఆమిర్ తర్వాత మళ్లీ జక్కన్న సినిమాతోనే 1000 కోట్లను కంబైన్డ్ గా టచ్ చేశారు తారక్, రామ్ చరణ్. మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ తౌసండ్ క్రోర్ క్లబ్ లో చేరి ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. అయితే ట్రిపుల్ ఆర్ తో 2వేల కోట్లను టచ్ చేయాలని కలలు కన్నారు టీమ్. కానీ లాంగ్ రన్ లో 1200 కోట్లను క్రాస్ చేసే దిశగా ట్రిపుల్ ఆర్ నడుస్తోంది. 2వేల మైల్ స్టోన్ ప్రస్తుతానికైతే కలగానే మిగలనుంది. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను మాత్రం ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్ల హీరోలుగా నిలబెట్టింది.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

సింగిల్ గా 100 కోట్ల సినిమాతో వచ్చి 1000 కోట్లను చాలా తేలికగా కొల్లగొట్టాడు యశ్. రాకింగ్ స్టార్ స్టైల్ కి దేశవ్యాప్త ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చాప్టర్ 1 టైమ్ లోనే యశ్ కటౌట్ కు పడిపోయిన ఆడియెన్స్.. చాప్టర్ 2 రికార్డులు సృష్టించేలా చేస్తున్నారు. 2వేల మైల్ స్టోన్ ను యశ్ రీచయిన ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. అయితే ఓ సాధారణ కన్నడ స్టార్ ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ బాలీవుడ్ స్టార్స్ అసూయ పడేలా 1000 కోట్ల దూకుడు చూపించాడు యశ్.

Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!

ప్రస్తుతానికైతే వెయ్యి కోట్ల క్లబ్ లో సౌత్ హీరోలదే హవా. తక్కువ స్పాన్ లో బాలీవుడ్ స్టార్స్ ను తలదన్నేలా మ్యాజిక్ చేయడం వీళ్లకే చెల్లింది. ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సింగిల్ పీస్ గా బాలీవుడ్ హీరో అమీర్ కనిపిస్తున్నాడు. చూస్తుంటే సలార్ తో ప్రభాస్.. లాల్ సింగ్ చద్దాతో అమీర్ మరోసారి తౌసండ్ క్రోర్ మ్యాజిక్ ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్.

Pushpa Collections: నార్త్‌లో పుష్పరాజ్ హవా.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే

రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు కూడా తౌసండ్ క్రోర్ ఫీట్ సాధించేలా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అంచనాలు తప్పింది కాబట్టి మహేశ్ సినిమా విషయంలో టార్గెట్ గట్టిగానే ఫిక్స్ చేస్తాడు జక్కన్న. ఇక పుష్ప2తో బన్నీ 1000 కోట్ల మార్క్ చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ పుష్ప మ్యానియా ఉంది. దానికి తగ్గట్టే పుష్ప2 రెడీ చేస్తున్నారు సుకుమార్. నార్త్ ఆడియెన్స్ ను అలరించేలా పుష్ప ది రూల్ లో మార్పులు చేసి ఎలాగైనా 1000 కోట్లను దాటేయలనేది ఐకాన్ స్టార్ ఆలోచన.

First Day Collections : 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే!

ఇండియన్ బాక్సాఫీస్ కింగ్స్ లా సౌత్ హీరోలు మెరిసిపోతుంటే… షారుఖ్, సల్మాన్ లాంటి బడా స్టార్స్ సైతం ఆ ఫీట్ ను రీచయ్యేలా కసరత్తులు చేస్తున్నారు. లేట్ అయినా సరే సాధ్యం చేసి చుపిస్తామంటున్నారు. 2023లో రాబోతున్న పఠాన్ తో షారుఖ్… టైగర్ 3తో సల్మాన్ పాత రికార్డులకు కొత్త పాఠాలు చెప్తామంటున్నారు. ఇప్పటికే వెనుకబడిన వాళ్ల ఫేవరేట్ హీరోల కోసం ఫ్యాన్స్ కూడా బాగానే ఉత్సాహం చూపిస్తున్నారు. మరి నెక్ట్స్ 1000 కోట్ల క్లబ్ మెంబర్ షిప్ తీసుకునే హీరో ఎవరో…