First Day Collections : 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే!

కరోనా ప్రభావం తగ్గడంతో ఫుల్ అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత వచ్చిన వకీల్ సాబ్, అఖండతోపాటు మరికొన్ని చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూదాం

First Day Collections : 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే!

First Day Collections

First Day Collections : కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ కుదేలైన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఉపాధి లేక చాలామంది అనేక ఇబ్బందులు పడ్డారు. మరోపక్క పూర్తైన సినిమాలను రిలీజ్ చేయలేక నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నారు. ఇక క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. షూటింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగష్టు తర్వాత నిర్మాతలు దైర్యం చేసి సినిమాలను రిలీజ్ చేయడం ప్రారంభించారు.

చదవండి : Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

థియేటర్లు కూడా ఓపెన్ కావడంతో చిన్న సినిమాలతోపాటు భారీ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మార్కెట్ మాత్రం కరోనాకు ముందు ఉన్నట్లుగా లేదు. కరోనాకు ముందు విడుదలైన బాహుబలి లాంటి సినిమాలు మొదటి రోజు రూ.100 కోట్ల షేర్ వసూలు చేసింది. చిన్న సినిమాలు కూడా 10కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిల్లో భారీ చిత్రాలు విడుదలైతే ఆ రేంజ్ కలెక్షన్స్ రాబడతాయా అంటే.. కష్టమే అంటున్నారు నిపుణులు.

చదవండి : Akhanda Bulls: అఖండకే హైలెట్ ఈ గిత్తలు.. కృష్ణార్జునుల ప్రత్యేకతలివే!

ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ డే కలెక్షలను ఓ సారి పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన వకీల్ సాబ్ మూవీ మొదటి రోజు అత్యధికంగా వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం నిలిచింది. ఈ ఏడాది రిలీసైన చిత్రాలు.. వాటి మొదటి రోజు వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.

వకీల్ సాబ్: 32.34 కోట్లు
అఖండ: 15.39 కోట్లు
ఉప్పెన: 9.35 కోట్లు
లవ్ స్టోరీ: 6.94 కోట్లు
క్రాక్: 6.25 కోట్లు
మాస్టర్: 5.76 కోట్లు
రెడ్: 5.47 కోట్లు
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: 5.45 కోట్లు