Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

అసలు బాక్సాఫీస్ లెక్కలు.. ఇప్పుడు తేలబోతున్నాయి. హాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ లు రెడీ అవుతున్నాయి. ఒక వైపు జురాసిక్ వరల్డ్ జూలు విదిలిస్తుంటే.. మరోవైపు టాప్ క్రూజ్ యాక్షన్ గన్స్ పట్టుకుని రెడీ అవుతున్నారు.

Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

Hollywood Movies

Hollywood Movies: అసలు బాక్సాఫీస్ లెక్కలు.. ఇప్పుడు తేలబోతున్నాయి. హాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ లు రెడీ అవుతున్నాయి. ఒక వైపు జురాసిక్ వరల్డ్ జూలు విదిలిస్తుంటే.. మరోవైపు టాప్ క్రూజ్ యాక్షన్ గన్స్ పట్టుకుని రెడీ అవుతున్నారు. థార్ యాక్షన్ తో పాటు ప్రేమను పంచడానికి రెడీ అవుతుంటే.. మరోవైపు అవతార్ 2 ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డుల్ని తుడిచెయ్యడానికి రెడీ అవుతోంది. ఇలా ఈ సంవత్సరం హాలీవుడ్ లో హై యాక్షన్ ఎలివేషన్ ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అవుతున్న సూపర్ హీరోలెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

అసలు సిసలు యాక్షన్ ని చూపించడానికి రెడీ అయ్యింది హాలీవుడ్. రెండేళ్ల నుంచి మిస్ అయిన హాలీవుడ్ హంగామాని చూపించబోతున్నారు స్టార్ హీరోలు. ఈ సమ్మర్ నుంచి మొదలుపెట్టి ఇయర్ ఎండ్ వరకూ అన్ బిలీవబుల్ యాక్షన్, గ్రాఫిక్స్, ఎలివేషన్ తో సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతోంది హాలీవుడ్. మే 6న డాక్టర్ స్ట్రేంజ్ తో మొదలవబోయే ఈ హాలీవుడ్ హంగామా.. బ్యాక్ టూ బ్యాక్ టాప్ మూవీస్ తో కంటిన్యూ అవ్వబోతోంది. మే హీట్ ని మరింతపెంచడానికి తన యాక్షన్ గన్ తో వస్తున్నారు టామ్ క్రూజ్. యాక్షన్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాప్ గన్ మెవరిక్ మూవీ మే 27న రిలీజ్ అవుతోంది. 1996లో స్టార్ట్ అయిన ఈ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను దాదాపు 25 ఏళ్ళుగా సూపర్ హిట్ చేస్తూ.. స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు టామ్ క్రూజ్. ఇప్పుడు 7 సిరీస్ తో మరోసారి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రైలర్ జురాసిక్ వరల్డ్. క్రిస్ ప్రాట్ లీడ్ రోల్ లో కోలిన్ ట్రివోర్ డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ జురాసిక్ వరల్డ్. ఇప్పటి వరకూ వచ్చిన జురాసిక్ రిలేటెడ్ మూవీస్ తో విజువల్ వండర్స్ ని చూపించిన మేకర్స్.. ఈ సిరీస్ లో జురాసిక్ వరల్డ్ డొమీనియన్ ని జూన్ 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

జులైలో సూపర్ హీరో థార్.. లవ్ అండ్ థండర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ద మోస్ట్ అవెయిటింగ్ థార్ మూవీగా జులై 8 న రిలీజ్ కాబోతోంది ఈ హాలీవుడ్ మూవీ. ఇక క్రేజీ మూవీ బ్లాక్ పాంథర్ నవంబర్ 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అసలు సిసలు విజువల్ వండర్ ని చూపించబోతున్న మూవీ అవతార్ 2. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టైటిల్ తోనేఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన అవతార్ 2.. డిసెంబర్ 16న రిలీజ్ అవ్వబోతోంది. అమేజింగ్ విజువల్స్ తో, అంతకుమించిన గ్రాఫిక్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ 2 ఇప్పటి వరకూ ఉన్నహాలీవుడ్ రికార్డుల్ని బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫాన్స్.