రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా, తెలంగాణలో కొత్త రూల్

కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 01:53 AM IST
రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా, తెలంగాణలో కొత్త రూల్

కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు

కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశుభ్రతపైనా ఫోకస్ పెట్టింది. ఎక్కడా చెత్తా, చెదారం కనిపించకుండా చూడాలంటోంది. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతోంది. రోడ్డుపై చెత్త వేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్డుపై చెత్త వేస్తే బాదుడే, జూన్ 1 నుంచి 8 వరకు పారిశుద్ద్య ప్రత్యేక డ్రైవ్:
ఇకపై రోడ్డుపై చెత్త వేసేవారికి 500 జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలను పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది కఠినంగా వ్యవహరించాలన్నారు. మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోకి కరోనా అడుగుపెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. పంచాయతీల పాలనా సామర్థ్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా.. పల్లె ప్రగతి స్ఫూర్తితో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీన్ని పురస్కరించుకుని శనివారం(మే 30,2020) పలు సూచనలు చేశారు మంత్రి. స్పెషల్ డ్రైవ్ లో తొలి రోజు సర్పంచ్, వార్డు మెంబర్లు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు.

ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణపై సూచనలు:
* జూన్‌ 1న సర్పంచ్‌, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలి. తదుపరి సమావేశాలు నిర్వహించాలి. 8వ తేదీ వరకు చేపట్టే పనులపై ప్రణాళికలను ప్రజలకు తెలియజేసి, వారినీ భాగస్వాములను చేయాలి.
* స్వచ్చమైన నీటిని ప్రజలకు అందించాలి. ప్రతి నెల 1, 11, 21 తేదీల్లో నీటి ట్యాంకులను శుభ్రపర్చాలి. ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి.
* జనసమ్మర్థ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎస్సీ, ఎస్టీలు నివాసముండే ప్రాంతాలతో పాటు హైరిస్క్‌ ప్రాంతాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి.
* ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం, పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించేలా చూడాలి. ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తిరిగివస్తున్న వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.
* రెండు విడతల ‘పల్లె ప్రగతి’ విజయవంతమైనందు వల్లే గ్రామాల్లో కరోనా ప్రభావం లేదు. అదే స్ఫూర్తిని కొనసాగించాలి.
* డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలి. దిగువ ప్రాంతంలోకి వర్షపు నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి.