Russia Missile Test: యుక్రెయిన్ కు మరో టెన్షన్, హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన రష్యా

బెలారస్‌తో కలిసి సైనిక ప్రయోగాలు నిర్వహిస్తున్న రష్యా.. అందులో భాగంగా హైపర్సోనిక్, క్రూయిజ్ మరియు అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.

Russia Missile Test: యుక్రెయిన్ కు మరో టెన్షన్, హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన రష్యా

Russia

Russia Missile Test: యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉందంటూ అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న క్రమంలో.. యుక్రెయిన్ కు దడపుట్టించే విధంగా రష్యా మరో అడుగు ముందుకు వేసింది. హైపర్‌ సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను రష్యా విజయవంతంగా నిర్వహించినట్లు ఆ దేశ జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరి గెరాసిమోవ్ తెలిపారు. బెలారస్‌తో కలిసి సైనిక ప్రయోగాలు నిర్వహిస్తున్న రష్యా.. అందులో భాగంగా హైపర్సోనిక్, క్రూయిజ్ మరియు అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. TU-95 బాంబర్లు మరియు జలాంతర్గాములు కూడా ఉన్న ఈప్రయోగాల్లో అన్ని క్షిపణులు వాటి లక్ష్యాలను విజయవంతంగా చేధించాయని, దీంతో వాటి పనితీరు లక్ష్యాలను నిర్దారించుకోగలిగామంటూ వాలెరి గెరాసిమోవ్ తెలిపారు.

Also read: Covid USA: అమెరికాలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉదృతి, అత్యవసరస్థితిని పొడిగించిన బైడెన్

శత్రువులను గురిచూసి కొట్టే విధంగా.. ఆయా క్షిపణులను తీర్చిదిద్దామని..తమ వ్యూహాత్మక బలగాల పనితీరును పరిపూర్ణం చేసే దిశగా ఈ పరీక్షలు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి క్రెమ్లిన్ లో ఈ ప్రయోగాలను వీక్షించారు. ఇప్పటికే రష్యా దాడికి దిగుతుందన్న భయంతో గజగజలాడుతున్న యుక్రెయిన్ ప్రభుత్వం.. ఇప్పుడు రష్యా పరీక్షించిన ప్రయోగాలతో మరింత ఆందోళనకు గురవుతుంది.

Also read: Europe Eunice storm : లండన్ లో రాకాసి గాలుల్లో కొట్టుకుపోతున్న జనాలు..ఊగిపోతున్న విమానాలు

మరో వైపు యుక్రెయిన్ పై దాడికి పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ అమెరికా హెచ్చరిస్తుంది. యుక్రెయిన్ పై దాడి ఆలోచనే లేదన్న పుతిన్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ.. బైడెన్ హెచ్చరికలు చేశారు. యుక్రెయిన్ పై దాడికి పాల్పడితే.. ఐరోపా దేశాలతో కలిసి అమెరికా రష్యాపై యుద్ధం ప్రకటిస్తుందని బైడెన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి వెనక్కు తగ్గినా, యుక్రెయిన్ పై దండయాత్రకే పుతిన్ మొగ్గు చూపుతున్నారని అమెరికా నిఘావర్గాలు చెప్పినట్టు అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు.

Also read: India – UAE: మనకు బంగారు కడ్డీలు, వారికి ఆభరణాలు: దుబాయ్ – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం