Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్, నిర్లక్ష్యమే కారణం!

రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌కి ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.

Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్, నిర్లక్ష్యమే కారణం!

Sai Dharam Tej

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌కి ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స కొనసాగుతుండగా.. కాలర్ బోన్ శస్త్ర చికిత్సపై ఆదివారం సాయంత్రానికి నిర్ణయం తీసుకోనున్నారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయనకు తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని తెలిపారు.

Read More : Apollo : సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్

అయితే ఇలాంటి కేసుల్లో 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. అందుకే 48 గంటల పాటు ఆయనను క్లోజ్‌గా మానిటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలాంటి సర్జరీ చేయబోమని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే ఆదివారం సాయంత్రానికి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read More : Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది

అటు సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాద సమయంలో సాయిధరమ్‌తేజ్‌ 75 కిలోమీటర్ల వేగంతో బైక్‌ నడిపాడన్నారు. కేబుల్ బ్రిడ్జిపై సగటున 100 కిలోమీటర్ల వేగంతో బైక్‌ వెళ్లిందన్నారు. ప్రమాద స్థలంలో వేగం పరిమితి 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఉందన్నారు డీసీపీ.

Read More : సాయిధరమ్ తేజ్ రేస్‌లో పాల్గొన్నారా…లేదా…? డీసీపీ క్లారిటీ

సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌  కొనుగోలు చేశారని డీసీపీ వెల్లడించారు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తామని తెలిపారు. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని, బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్‌ డీసీపీ పేర్కొన్నారు. అయితే తేజ్‌ నుంచి టూవీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేవలం లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందన్నారు.