Shaakuntalam : కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ చేస్తూ వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'శాకుంతలం'. ఇటీవల ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తాము అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, ఆ డేట్ కి సినిమాని రిలీజ్ చేయలేక పోతున్నాము అంటూ ప్రేక్షకులకు తెలియజేశారు. తాజాగా ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది సమంత.

Shaakuntalam : కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన సమంత..

Shaakuntalam

Shaakuntalam : స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ చేస్తూ వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. హిందూ పురాణాలు కథ కావడంతో ఎటువంటి కాంట్రవర్సీలకు గురి కాకుండా గుణశేఖర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ లోని టెక్నికల్ విలువలు, గుణశేఖర్ టేకింగ్ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Samantha : తన బిజినెస్‌లో పార్టనర్‌షిప్ కలిపిస్తూ సమంత బంపర్ ఆఫర్..

ఇక ఈ సినిమా ఇప్పటికే చాలా లేటు అవుతూ వచ్చింది. ఇటీవల ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తాము అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, ఆ డేట్ కి సినిమాని రిలీజ్ చేయలేక పోతున్నాము అంటూ ప్రేక్షకులకు తెలియజేశారు. దీంతో సమంత అభిమానులు.. ఎన్నిసార్లు పోస్ట్‌పోన్ చేస్తారు అంటూ తమ బాధని వ్యక్తం చేశారు. తాజాగా ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది సమంత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

ఫిబ్రవరి 17న విడుదల చేయపోడానికి కారణం ఆరోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అనుకున్నారు అందరూ, కానీ ఇప్పుడు ఏకంగా రెండు నెలలు పాటు పోస్ట్‌పోన్ చేయడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకోకపోవడం అనుకుంటా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు. దీంతో లేటు అయినా పర్లేదు క్వాలిటీ మేకింగ్ తో రండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. గుణశేఖర్ తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్, మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.