Samantha: ఎమోషనల్ టచ్.. లైఫ్ వేరియేషన్స్ చూపిస్తోన్న సామ్!

కసి చూపిస్తుంది.. కష్టపడుతుంది.. ఎంజాయ్ చేస్తుంది.. అంతలోనే బాగా ఎమోషనల్ అయిపోతుంది సమంతా. చైతూతో బ్రేకప్ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సామ్.. మరోవైపు తన ఎమోషనల్ జర్నీతోనూ..

Samantha: ఎమోషనల్ టచ్.. లైఫ్ వేరియేషన్స్ చూపిస్తోన్న సామ్!

Samantha (1)

Samantha: కసి చూపిస్తుంది.. కష్టపడుతుంది.. ఎంజాయ్ చేస్తుంది.. అంతలోనే బాగా ఎమోషనల్ అయిపోతుంది సమంతా. చైతూతో బ్రేకప్ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన సామ్.. మరోవైపు తన ఎమోషనల్ జర్నీతోనూ ఫ్యాన్స్ ను టచ్ చేస్తోంది. ఇప్పుడైతే ఒకేసారి రకరకాల వేరియేషన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ హీరోయిన్.

Samantha: శాకుంతలం ఫస్ట్‌లుక్‌ చూశారా.. దేవకన్యలా సామ్!

శాకుంతలం నుంచి సమంతా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజయ్యే అవకాశముంది. అటు సామ్ నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ యశోద సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో.. రిచ్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. బైసెక్సువల్ గా నటించబోయే అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. విజయ్ సేతుపతితో సమంతా నటించిన కాదు వాక్కుల రెండు కాదల్ రిలీజ్ కి రెడీ అయింది. త్వరలోనే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతుంది. సో ఈ మూవీస్ లిస్ట్ అంతా సమంతా నాణేనికి ఒక వైపే.. మరో సైడ్ ఆమె ఎమోషనల్ జర్నీనే హైలైట్ అవుతోందిప్పుడు.

Samantha : నువ్వు లేని జీవితం ఊహించలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్..

చైతూతో విడిపోయాక ప్రొఫెషనల్ గా తన లెవలెంటో చూపించాలన్నది సమంతాలో కనిపిస్తోంది. ఆ ట్రైల్స్ లో ఆమెకు పుష్ప సాంగ్ రూపంలో ఫస్ట్ సక్సెస్ దక్కింది కూడా. అయితే అదీ మాత్రమే విషయం కాదిక్కడ. ఫిట్ నెస్ కోసం ఎన్ని కసరత్తులు చేస్తుందో మెంటల్ స్ట్రెంత్ కోసం కూడా సమంతా అంతే కష్టపడుతోంది. అందుకే చిన్నపిల్లలా ఎగిరి గంతులేస్తుంది. స్పిరిచువల్ బాట పట్టి పెద్దరికాన్నీ ప్రదర్శిస్తుంది. రీసెంట్ గా కేరళలోని అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ లో రెక్కలు విప్పిన సీతాకోకచిలుకలా ఫోజులిచ్చింది సామ్. తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చొని.. నీ ఉనికిలోని అసలైన అర్థం ఏంటో తెలుసుకోవాలంటే అది ధ్యానంతోనే సాధ్యమంటూ కొటేషన్ పోస్ట్ చేసింది.

Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!

మోటివేషనల్, పర్సనల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తూ తన మెంటల్ స్టేటస్ ఏంటో కూడా చెప్పకనే చెప్పేస్తుంది సమంతా. లేటెస్ట్ వెకేషన్ లో తన ఫ్రెండ్ మేఘనా వినోద్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నువ్వు లేని ఇలాంటి జీవితాన్ని ఊహించుకోలేనంటూ రాసుకొచ్చింది. గతంలో కూడా ఇలానే ఫ్రెండ్స్ తో జర్నీ చేస్తూ ఎమోషనల్ టచ్ ఇచ్చింది సామ్. సో మొత్తంగా చూస్తే లైఫ్ లో బ్రేకప్ అనే బిగ్ స్టెప్ తీసుకన్నాక.. కేవలం సినిమా హైప్ తోనే కాదు తనలోని ఎమోషనల్, మోటివేషనల్, ఫన్, సెన్సిటివ్.. ఇలా రకరకాల వేరియేషన్స్ తో ట్రెండ్ అవుతోంది సమంతా.