Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!

చైతూ భార్యగా ఉన్నప్పుడు సమంతా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేది. లైఫ్ ప్లానింగ్ అంటూ అప్పుడు మంచి అవకాశాలను కూడా కాదనుకొని..

Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!

Samantha

Samantha: చైతూ భార్యగా ఉన్నప్పుడు సమంతా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేది. లైఫ్ ప్లానింగ్ అంటూ అప్పుడు మంచి అవకాశాలను కూడా కాదనుకొని కాంప్రమైజ్ అయిందని ఆమె స్నేహితురాలే స్వయంగా చెప్పింది. విడాకుల తర్వాత ఫ్రీడమ్ వచ్చిందో మరింత కసిపెరిగిందో కానీ సౌత్ నుండి నార్త్ వరకు.. మరో స్టెప్ ముందుకేసి హాలీవుడ్ సినిమాను కూడా లైన్ లో పెట్టేసింది ఇప్పుడు మంచి స్వింగ్ మీదుంది.

Naresh59: అల్లరోడి కొత్త సినిమా.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే!

జస్ట్ సినిమాలే కాదు.. ఈ మధ్యనే ఓ అంటావా మావా అంటూ తెరని ఊపేసిన సామ్ డైవర్స్ తర్వాత నో బ్రేక్స్ ఓన్లీ జోష్ అనేస్తుంది. ఇక సామ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డైవర్స్ తర్వాత మార్చేసినట్లుగా కనిపిస్తుంది. అంతకు ముందు కూడా ట్రెండ్ ను బాగా ఒంటబట్టించుకున్న సామ్ ఇప్పుడు ధరించిన ఓ టీ షార్ట్ హాట్ టాపిక్ గా మారింది. సామ్ తాజా ఓ కొటేషన్ లాంటి పదాలు కలిగిన ప్రింటెడ్ టీ షర్ట్ ధరించి కెమెరాకు చిక్కింది.

Celebrities Divorce: విడాకులందు.. సినిమా వాళ్ళ విడాకులు వేరయా!

ఆ టీ షర్ట్ మీద ప్రింట్ చేసిన కొటేషన్ కాస్త బూతు పదాలతో కూడినదే కాకుండా అందులో అర్ధం కూడా చాలా బూతు కావడంతో ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో రచ్చగా మారింది. సమంతాకి డైవర్స్ తర్వాత ఫ్రీడమ్ పేరుతో పిచ్చి ముదిరిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఆమె ఫ్యాన్స్ మాత్రం టీ షర్ట్ మీద లైన్స్ సామ్ ను విమర్శించే వాళ్ళ కోసమేనని.. ఆ పదాలతోనే సామ్ వాళ్ళకి తగిన సమాధానం చెప్తుందని వెనకేసుకొస్తున్నారు. ఏది ఏమైనా సామ్ డేరింగ్ అనే చెప్పాలి.