Samantha Akkineni: సామ్ మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్?

సమంత అక్కినేని చైతూతో పెళ్లి తర్వాత ఒకవైపు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 నటిగా తన స్థాయిని పెంచింది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు.

Samantha Akkineni: సామ్ మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్?
ad

Samantha Akkineni: సమంత అక్కినేని చైతూతో పెళ్లి తర్వాత ఒకవైపు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 నటిగా తన స్థాయిని పెంచింది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఈ వెబ్ సిరీస్ తోనే సామ్ బాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది.

కాగా ఇప్పుడు ఫ్యామిలీ మాన్ దారిలోనే సామ్ మరో పాన్ ఇండియా స్థాయి వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలుస్తుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్న ఈ మల్టీ లాంగ్వేజెస్ సిరీస్ లో సామ్ నటించడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సామ్ ను సంప్రదించగా ఆమె కూడా ఈ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. హిందీ, తమిళంతో పాటు తెలుగులో కూడా తెరకెక్కనున్న ఈ సిరీస్ లో కూడా సామ్ పాత్ర తన రేంజ్ ని మరింత పెంచేలా ఉంటుందని చెప్తున్నారు. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’తో పాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలలో నటిస్తుంది.