Sri Reddy: సంసారంపై సమంతకు శ్రీరెడ్డి సలహాలు

టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నారనే వార్త తెలుగు సినిమా అభిమానులను షాకింగ్‌కు గురిచేసింది.

Sri Reddy: సంసారంపై సమంతకు శ్రీరెడ్డి సలహాలు

Samantha

Sri Reddy: టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నారనే వార్త తెలుగు సినిమా అభిమానులను షాకింగ్‌కు గురిచేసింది. వారిద్దరు విడిపోవటం ఖాయమనే వార్తలు వచ్చిన తర్వాత.. వారి కుటుంబం నుంచి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈక్రమంలో వారి విడాకులకు ముహూర్తం సైతం ఖరారైందనే వార్త జాతీయ మీడియాలో సైతం వస్తోంది. ఈ అంశం పైన స్పష్టత లేక అందుతున్న సమాచారంతో కథనాలు నిడిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద క్యారెక్టర్‌గా నిలిచిన శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా.. ఓ వీడియోలో సమంతకు సంసారంపై కొన్ని సూచనలు చేసింది. సమంత వదిన.. అంటూ.. మీరు మా అన్నయ్య ఎప్పటికీ కలిసుండాలి అంటూ రాసుకొచ్చింది. “సంసారంలో సరిగమలు సహజం, సమంతా వదిన.. మీరు, మా అన్నయ్య ఎప్పటికీ కలిసి ఉండాలి” అంటూ ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేసింది.

మీరిద్ద‌రూ క‌లిసుండాల‌ని మేమంతా కోరుకుంటున్నాం. మీ ఇద్ద‌రినీ మేమంతా ఆశీర్వ‌దిస్తున్నాం. మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే దంపతుల్లా ఉండాలని అనుకుంటున్నాం. మిమ్మ‌ల్ని చూసి చాలామంది ఇన్‌స్పైర్ అవుతారు. స‌ర్దుబాటు అనేది ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఇది నా విజ్ఞ‌ప్తి మాత్ర‌మే. భార్యాభ‌ర్త‌ల‌న్న త‌ర్వాత సంసారంలో స‌రిగ‌మ‌లుంటూనే ఉంటాయి. కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డం, ఈగో, ఆటిట్యూడ్స్ మామూలే. అమ్మాయికి ఎక్కువ ఓపిక ఉండాల‌ని మ‌న భార‌త‌దేశం మ‌న‌కు నేర్పించింది. ఓపికతో ఉండి మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.