Pushpa- Samantha: దీపాలన్నీ ఆర్పేశాక.. ఊ.. ఊఊ.. సామ్ స్పెషల్ ట్రీట్! పాట విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా వస్తూ.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్పకు మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా..

Pushpa- Samantha: దీపాలన్నీ ఆర్పేశాక.. ఊ.. ఊఊ.. సామ్ స్పెషల్ ట్రీట్! పాట విడుదల

Pushpa

Pushpa- Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా వస్తూ.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్పకు మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయగా గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది. మరో వారమే విడుదలకు సమయం ఉండడంతో మేకర్స్ ఏ మాత్రం అటెన్షన్ తగ్గకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Nandamuri వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!

తాజాగా ఈరోజు (శుక్రవారం) పుష్ప నుండి స్పెషల్ సాంగ్ విడుదల చేశారు. సమంతా మాస్ స్టెప్పులతో అదరగొట్టనున్న ఈ పాట ఇప్పుడు సినిమాకి అట్రాక్షన్ కానుందని చెప్పుకోవచ్చు. ఊ కొడతావా మావా.. ఊఊ కొడతావా మావా అంటూ సాగిన ఈ పాటలో మగాళ్ల బుద్దే వంకర బుద్ది అనేలా సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటలో సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి వాయిస్ పాటని మరో మెట్టు ఎక్కించింది.

Telugu Film Releases: ఈ వీకెండ్ థియేటర్‌లోకి వచ్చిన సినిమాలివే!

మత్తు వాయిస్ తో సాగిన ఈ పాట మొత్తం మగాళ్ల బుద్దే వంకర బుద్ది అనేలా మీనింగ్ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ మార్క్ పాటగా ముద్ర వేసింది. సహజంగానే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక ఈ ఊ కొడతావా మావా.. ఊఊ కొడతావా మావా పాట ఆ పాటలను మించి అదరగొడుతుంది. మరి ఈ పాటకి సమంతా స్టెప్పులు ఎలా ఉంటాయో సినిమాలో చూడాల్సిందే.