Muchhinthal : మూడోరోజు సమతామూర్తి శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాలలోని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరయ్యారు.

Ramanuja
Sri Ramanuja millennium celebrations : మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. భక్తీపారవశ్యంలో ముంచెత్తుతూ సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం మూడోరోజు కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం.. ఏడున్నర గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు హోమాలు ప్రారంభమయ్యాయి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాలలో పర్యటించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి హోమాలు ప్రారంభం కానున్నాయి.. సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టిని నిర్వహించనున్నారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు..!
తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమ గుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది.
సేవాకాలంలో రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్ని ఆవాహన కార్యక్రమంతో క్రతువు మొదలవుతోంది. శమి, రావి కర్రలతో అగ్ని మధనం జరిగింది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులూ… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని..రోజూ కోటిసార్లు జపించనున్నారు. దీంతో.. దివ్యక్షేత్రం శ్రీరామనగరం.. నారాయణ మంత్రంతో మార్మోగుతుంది.
TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు
పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపమని, కాంచీపురానికి గుర్తుగా వెనుక వైపు ఉన్న భాగానికి త్యాగ మండపం, మేల్కోట క్షేత్రాన్ని తలచుకుంటూ ఎడమ వైపు ఉన్న మండపానికి జ్ఞాన మండపం అన్న నామకరణం చేసారు. ఆపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు ప్రారంభమయింది.