Sanjay Raut : హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ కామెంట్స్

మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నా.. పోలీసులు.. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది రెచ్చగొట్టే లక్ష్యంతో...

Sanjay Raut : హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ కామెంట్స్

Shiv Sena Mp

Updated On : April 17, 2022 / 3:05 PM IST

Violent Incidents : దేశంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ముందస్తుగా.. రాజకీయంగా ప్రేరేపించబడినవని, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దేశ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని, ఈ పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇండియా-పాక్, సర్జికల్ స్ట్రైక్స్, రామ మందిరం వంటివి పని చేయకపోవడంతో అల్లర్లను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని MNS చీఫ్ రాజ్ థాకరే పిలుపునివ్వడంపై రౌత్ స్పందించారు.

Read More : Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్

మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నా.. పోలీసులు.. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది రెచ్చగొట్టే లక్ష్యంతో ఉన్నట్లు, అల్లర్లను మాత్రం తాము జరగనివ్వమని తేల్చిచెప్పారు. నవ్ నిర్మాణ్ సేన అధ్యక్షులు రాజ్ థాకరేని ఒవైసీతో పోలుస్తూ.. విమర్శలు చేశారాయన. అయితే.. తాను ఎవరి పేరును కూడా తీసుకోవడం లేదని రాజ్ థాకరేని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల సందర్భంగా.. ఒవైసీ విషయంలో బీజేపీ ఏమి చేసిందో అందరికీ తెలిసిందేనని, ఇలాగే మహారాష్ట్రలో కూడా హిందూ ఒవైసీ కోసం అదే చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. కొత్త ఒవైసీ, హిందూ ఒవైసీ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

Read More : Hubli Police station: అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై దాడి: 12 మంది స్టేషన్ సిబ్బందికి గాయాలు, 40 మంది అరెస్ట్

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దుండగులు వాహనాలకు నిప్పు‌పెట్టారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడిచేసి శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. జహంగీర్ పురి ప్రాంతంలో మరోసారి అల్లర్లు చెలరేగకుండా పటిష్ఠ భద్రత చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More : Hanuman Jayanti : ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే హనుమాన్ లాంగూల స్తోత్రమ్

కర్ణాటకలో మతపరమైన అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక పరమైన ఘర్షణలతో కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా అట్టుడుకుతోంది. శనివారం అర్ధరాత్రి హుబ్లీ పోలీస్ స్టేషన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. దుండగులు..అర్ధరాత్రి సమయంలో రాళ్లు, కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు.