Rishabh Pant vs Sanju Samson: సంజూ వర్సెస్ రిషబ్.. వీరిలో ఎవరు గ్రేట్..! న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ వేళ ఆసక్తికర చర్చ..

టీమిండియాలో రిషిబ్, సంజూ ఇద్దరూ నైపుణ్యత కలిగిన ఆటగాళ్లు. ఇద్దరూ వికెట్ కీపర్, బ్యాటర్లు. ఆటతీరులో ఎవరిస్టైల్ వారిదే. అయితే, పంత్ టెస్టుల్లో తనదైన రికార్డును సుస్థిరం చేసుకున్నాడు. కానీ, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఆమేరకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక పోతున్నాడు.

Rishabh Pant vs Sanju Samson: సంజూ వర్సెస్ రిషబ్.. వీరిలో ఎవరు గ్రేట్..! న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ వేళ ఆసక్తికర చర్చ..

Rishabh Pant vs Sanju Samson

Rishabh Pant vs Sanju Samson: ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ కొనసాగుతోంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. మరో టీమిండియా ఆటగాడు రిషిబ్ పంత్. వరుస అవకాశాలు వస్తున్నా విఫలమవుతూ వస్తున్నాడు. ఫలితంగా మాజీలు, క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. న్యూజీలాండ్ చివరి వన్డే మ్యాచ్‌కు సంజూను ఎంపిక చేయాలన్న డిమాండ్‌ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రిషిబ్ పంత్ వర్సెస్ సంజూ శాంసన్ అన్నట్లుగా చర్చకు తెరలేసింది.

Rishabh Pant: ఓపెనర్‌గా వెళ్లినా విఫలమయ్యాడు..! క్రికెటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై మండిపడుతున్న ఫ్యాన్స్

టీమిండియాలో రిషిబ్, సంజూ ఇద్దరూ నైపుణ్యత కలిగిన ఆటగాళ్లు. ఇద్దరూ వికెట్ కీపర్, బ్యాటర్లు. ఆటతీరులో ఎవరిస్టైల్ వారిదే. అయితే, పంత్ టెస్టుల్లో తనదైన రికార్డును సుస్థిరం చేసుకున్నాడు. కానీ, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఆమేరకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక పోతున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్‌లో పంత్ 95మ్యాచ్‌లలో ఎనిమిది అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో 1,842 పరుగులు చేశాడు. శాంసన్, ఇదే సమయంలో పంత్ కంటే చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. 27 మ్యాచ్‌లలో 626 పరుగులు చేశాడు. కానీ, వన్డేల్లో అతని సగటు చాలా ఎక్కువగా ఉంది. రిషబ్ సగటు 35తో పోల్చితే.. సంజూ 66సగటు కలిగి ఉన్నాడు.

IPL 2021-Sanju Samson: పరిస్థితులకు తగ్గట్లు ఆడటం నేర్చుకున్నా – సంజూ శాంసన్

సంజూకు జట్టులో తక్కువ అవకాశాలు అందుకున్నాడు. అతను ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన మొదటి వన్డేలో చోటు దక్కింది. చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన ఆశించిన స్థాయిలో రాణించాడు.  రెండో వన్డేలో అతని స్థానంలో దీపక్ హుడా తుదిజట్టులో అవకాశం కల్పించడంతో మ్యాచ్‌కు సంజూ దూరమయ్యాడు. అయితే ఈ విషయంపై కెప్టెన్ ధావన్ వివరణ ఇచ్చాడు. బౌలర్‌ను తుది జట్టులో ఎంపిక చేయాల్సి రావటంతో హుడాకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. తాజాగా ఈ చర్చ జరుగుతున్న వేళ.. న్యూజీలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ కుడిచేతి వాటం కలిగిన వికెట్ కీపర్ సుదీర్ఘమైన కెరీర్‌కు అర్హుడు అంటూ పేర్కొన్నాడు.