Rishabh Pant: ఓపెనర్‌గా వెళ్లినా విఫలమయ్యాడు..! క్రికెటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై మండిపడుతున్న ఫ్యాన్స్

టీమిండియా కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ న్యూజీలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో రాణిస్తారని అందరూ భావించారు. కానీ, ఓపెనర్‌గా బరిలోకి దిగినా పేలవ ప్రదర్శనను పంత్ కొనసాగించడంతో.. సోషల్ మీడియాలో ఆయన ఆటతీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది.

Rishabh Pant: ఓపెనర్‌గా వెళ్లినా విఫలమయ్యాడు..! క్రికెటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై మండిపడుతున్న ఫ్యాన్స్

Panth

Rishabh Pant: టీమిండియా కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ న్యూజీలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్యలో జరిగే మ్యాచ్‌లో రాణిస్తాడని అందరూ భావించారు. ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా వెల్లింగ్టన్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, పంత్ లు బ్యాటింగ్ ను ప్రారంభించారు.

India vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి ఇషాన్, పంత్

పంత్ కొద్దికాలంగా పేలవ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగన వరల్డ్ కప్ లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోలేక పోయాడు. అయినా టీమిండియా సెలక్టర్లు పంత్ పై నమ్మకం ఉంచి న్యూజీలాండ్ పర్యటనలో టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పంత్ ను ఓపెనర్ గా పంపిస్తే రాణిస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. పంత్ మాత్రం  ఓపెనర్ గా బరిలోకి దిగినా విఫలమయ్యాడు.

ఇవాళ మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభించిన పంత్.. 13 బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్ లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. పంత్ నిర్లక్ష్యపు ఆట తీరుతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాల, ఇలా ఆడుతుంటే టీమిండియా కెప్టెన్ చేయాలంట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. పంత్ ఆటతీరు 66వ అంతర్జాతీయ ట్రయల్ మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది అంటూనే.. ఇలా అయితే మున్ముందు పంత్ టీమిండియా జట్టులో చూడటం కష్టమని, ఆయనకు ఇక ఉద్వాసన పలకడమే మేలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక పంత్‌ అంటే పడనివారు తాజాగా అతని బ్యాటింగ్ తీరుపై విమర్శల డోస్ ను మరింత పెంచారు. మొత్తానికి పంత్ వరుస వైఫల్యాలతో విమర్శల పాలవుతున్నాడు.