8 Thottakkal: ‘ఏక్ మినీ కథ’ హీరోతో చిరంజీవి కూతురు సినిమా!

'ఏక్ మినీ కథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంతోష్ శోభన్.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. తమిళ భాషా క్రైమ్ థ్రిల్లర్ ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) తెలుగు రీమేక్‌లో శోభన్ నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.

8 Thottakkal: ‘ఏక్ మినీ కథ’ హీరోతో చిరంజీవి కూతురు సినిమా!

Santosh Shoban Headlines A Remake Produced By Sushmita Konidela

Sushmita Konidela: ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంతోష్ శోభన్.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు. తమిళ భాషా క్రైమ్ థ్రిల్లర్ ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) తెలుగు రీమేక్‌లో శోభన్ నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా ఒరిజినల్‌కు దర్శకత్తం వహించిన శ్రీ గణేషే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

‘జాను’, ’96′(తమిళ) కీర్తి గౌరీ కిషన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొనిదెల ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్‌లో నిర్మిస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యానర్‌లో ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను కూడా నిర్మించారు.

ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణను దర్శకుడు మారుతి చూసుకుంటున్నట్లు సమాచారం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఆగస్టులో తెరపైకి రానున్నట్లు తెలుస్తుంది.