Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అన్ని పనులు ముగించుకుని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ...

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!

Sarkaru Vaari Paata

Updated On : May 10, 2022 / 2:55 PM IST

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అన్ని పనులు ముగించుకుని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా సక్సెస్ కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి రోజుకో ట్వీట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఈ సినిమా క్రేజ్‌ను మరింత పెంచుతున్నాడు.

Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్‌వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!

తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ గురించి థమన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ‘సర్కారు వారి పాట’ సాంగ్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు ఓ ర్యాప్ వర్షన్ కూడా ఉండబోతుందని, ఈ పాట సినిమాకే హైలైట్‌గా మారుతుందని థమన్ చెప్పుకొచ్చాడు. తనకు నచ్చిన సీన్స్‌లో ఈ ర్యాప్ వర్షన్ ఉంటుందని, అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని థమన్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా బీజీఎం కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందని, డాల్బీ మిక్సింగ్‌తో బాక్సులు బద్దలవడం ఖాయమని థమన్ అంటున్నాడు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!

మరి నిజంగానే ఈ సినిమాలో సర్కారు వారి పాట ర్యాప్ సాంగ్ స్పెషల్‌గా మారబోతుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లోకి ఏ రేంజ్‌లో వెళ్లిపోయిందో మనం చూశాం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్ పెట్ల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మరి సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల మోత మోగిస్తుందో చూడాలి.