Godse: సొసైటీపై గాడ్సే అటాక్.. ట్రైలర్‌తో అదరగొట్టిన సత్యదేవ్!

టాలీవుడ్‌లో విలక్షణమైన పర్ఫార్మెన్స్‌లకు కేరాఫ్‌గా ఉన్న యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్నా, పలు కారణాల వల్ల....

Godse: సొసైటీపై గాడ్సే అటాక్.. ట్రైలర్‌తో అదరగొట్టిన సత్యదేవ్!

Satyadev: టాలీవుడ్‌లో విలక్షణమైన పర్ఫార్మెన్స్‌లకు కేరాఫ్‌గా ఉన్న యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్నా, పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇక ఈ సినిమాను ఎట్టకేలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే గాడ్సే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

గాడ్సే చిత్ర ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా ఉండటతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనకాల ఉన్నవారిపై పోరాడే వ్యక్తిగా గాడ్సే కనిపిస్తాడు. ముఖ్యంగా అవినీతి పరులైన రాజకీయ నేతలపై గాడ్సే వార్ డిక్లేర్ చేసినట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇక సత్యదేవ్ ఎప్పటిలాగే తనదైన మార్క్ యాక్టింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మీ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీగణేశ్ పట్టాభి డైరెక్ట్ చేస్తుండగా, సి.కళ్యాణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి గాడ్సే సినిమాతో సత్యదేవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.