COVID-19: ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో తగ్గు ముఖం పడుతున్న కరోనా

ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.

COVID-19: ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో తగ్గు ముఖం పడుతున్న కరోనా

Covid 19

COVID-19: ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి యాక్టివ్ కేసుల కంటే రికవరీ అయిన వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. గత వారం 19.8శాతం మంది రికవరీ అయితే ఈ వారం 21.9 శాతం రికవరీ అయ్యారని పాజిటివిటీ రేట్ గురించి వెల్లడించారు.

ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, డామన్ అండ్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్ లలో భారీగా కేసులు తగ్గుముఖం పట్టడం పాజిటివ్ అంశం.

10 రాష్ట్రాల్లో 85శాతం కరోనావైరస్ కేసులు
కరోనావైరస్ కేసులు పది రాష్ట్రాల్లో 85శాతం ఉండగా, 11రాష్ట్రాల్లో లక్షకు పైగా కొవిడ్-19 యాక్టివ్ కేసులు, 8రాష్ట్రాల్లో రూ.50వేల నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసులు పెంచుతూనే ఉన్నాం. చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సెకండరీ ఇన్ఫెక్షన్ తోనే మరణిస్తున్నారని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అంటున్నారు.

ఎయిమ్స్ డైరక్టర్ మ్యుకోర్మికోస్ (బ్లాక్ ఫంగస్) మట్టి, గాలి, ఫుడ్ లో కూడా ఉండొచ్చు. వైరస్ పరంగా అది చాలా తక్కువ శాతం కావొచ్చు. దానికి ఇన్ఫెక్షన్ ఏమీ రాదు. కొవిడ్-19కు ముందు కొద్ది కేసులు ఇలా కనిపించేవి. కానీ, అవి ఇప్పుడు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.