Lakhimpur Kheri : రైతులపై కావాలనే కారు ఎక్కించారు… పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందన్న సిట్

దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటనలో వాస్తవాలు బయటపడ్డాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందని సిట్ తేల్చింది.

Lakhimpur Kheri : రైతులపై కావాలనే కారు ఎక్కించారు… పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందన్న సిట్

Lakhim Pur

Lakhimpur Kheri attack incident : దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటనలో వాస్తవాలు బయటపడ్డాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందని..ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగా చేసిందేనని స్పష్టం చేసింది. రైతులపై కావాలనే కారు ఎక్కించారని కుండ బద్దలు కొట్టింది. లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితులుగా ఉన్న 13 మందిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307, 326, 34 కింద కేసులు నమోదు చేశారు.

ఘటనలో నిందితులగా ఉన్న 13 మందిపై ఐసీపీ సెక్షన్ 307తో సహా కొత్త సెక్షన్లను జోడించాలని ఆ ప్రాంత చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సిట్ దరఖాస్తు దాఖలు చేసింది. నిందితులపై ఉన్న ఐపీసీలోని 279, 338, 304ఏ.. స్థానంలో కొత్త సెక్షన్లను వారంట్ లో చేర్చేందుకు అనుమతించాలని సిట్ కోరింది. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా జరిగిందని..నిర్లక్ష్యం కాదని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 279 ర్యాష్ డ్రైవింగ్, సెక్షన్ 338 ఆవేశంగా కానీ, నిర్లక్ష్యంగా గానీ ఏదైనా చర్యల ద్వారా తీవ్రంగా గాయపరచడం, సెక్షన్ 304 ఏ నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Madhusudanachari : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

అయితే వాటి స్థానంలో సెక్షన్ 307 హత్యానేరం, సెక్షన్ 326 ప్రమాదకర ఆయుధాలతో స్వచ్ఛందంగా తీవ్రంగా గాయపర్చడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరింది. గత అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో ర్యాలీ చేస్తున్న రైతులపైకి మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు.

రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి ఆజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పు పెట్టారు.ఈ క్రమంలోనే ముగ్గురు కార్యకర్తు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఆశిష్ మిశ్రా ఉన్నారు. వారిని లఖింపూర్ ఖేరీ జైలులో ఉంచారు.

Flexi Clash In Tirupati : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేత

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఆశిష్ మిశ్రా డిసెంబర్ 10న బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు లక్నో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయం కూడా ఇచ్చింది. అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలంటూ ఘటన జరిగినప్పటి నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి రైతుల మరణానికి కారణమైన లఖింపూర్ ఖేరీ దారుణం తర్వాత రైతాంగ ఉద్యమానికి సానుభూతి మరింత పెరిగింది.