Madhusudanachari : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్14,2021) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Madhusudanachari : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Madhusudanachari

Governor Kota MLC Madhusudanachari : తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్14,2021) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ‌తంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ప‌ద‌వీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీతో ముగిసింది. ఆయ‌న స్థానంలో మ‌ధుసూద‌నాచారి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ చేసిన సిఫార‌సును గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదించారు. మ‌ధుసూద‌నాచారిని మండ‌లికి నామినేట్ చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శశాంక్ గోయ‌ల్ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీంతో నేటి నుంచి మ‌ధుసూద‌నాచారి ప‌ద‌వీకాలం ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

మ‌ధుసూద‌నాచారి.. 1982లో టీడీపీలో చేశారు. 1994-99 మ‌ధ్య కాలంలో శాయంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో మ‌ధుసూద‌నాచారి ఒక‌రు. 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత నూత‌న రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2018 ఎన్నిక‌ల్లో గండ్ర వెంక‌ట‌ర‌మణారెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు

Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి

మరోవైపు తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆరు స్థానాల్లో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం (డిసెంబర్14,2021) ఓట్ల లెక్కింపు జరిగింది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ రావు, ఎల్.రమణ గెలుపొందారు. మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థిపై 524 ఓట్లతో విజయం సాధించారు. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. ప్రత్యర్థి నగేష్ పై 691 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. ఆదిలాబాద్‌లో దండే విఠల్ గెలుపొందారు.

టీఆర్ఎస్ అధిష్టానం ఊహించినట్లే ఆ పార్టీ ఓటర్లు కాంగ్రెస్‌కు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యా బలానికి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు సంబంధించిన 140 ఓట్లు క్రాస్ అయినట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ అయినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి కాంగ్రెస్‌కు ఉన్న బలం 103 మాత్రమే… కానీ, 242 వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం ఈ క్రాస్ ఓటింగ్ పై ఆరా తీస్తుంది. ఏ నియోజకవర్గం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందనే వివరాలు సేకరించే పనిలో పడింది.