Child Reporter : ఏడేళ్ల బాలుడి లైవ్‌ రిపోర్టింగ్‌.. సీఎం ఫిదా

ఏడేళ్ల బాలుడు చేసిన రిపోర్టింగ్ చూసి.. మణిపూర్ సీఎం ఫిదా అయ్యారు. సీఎం ఎన్‌. బిరెన్‌ సింగ్‌ సేనాపతి జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ బాలుడు రిపోర్టింగ్ చేశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి బాలుడిని అభినందించారు సీఎం.

Child Reporter : ఏడేళ్ల బాలుడి లైవ్‌ రిపోర్టింగ్‌.. సీఎం ఫిదా

Child Reporter

Updated On : August 11, 2021 / 11:51 PM IST

Child Reporter : కొందరు రిపోర్టర్లు ప్రత్యేక శైలిలో రిపోర్టింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటారు. పరిస్థితికి తగినట్లు హావభావాలను వ్యక్తం చేస్తూ రిపోర్టింగ్ చేస్తుంటారు. అటువంటి వారు ప్రజల నోళ్ళలో నానుతుంటారు. రిపోర్టింగ్ లో ఎంతో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ విధంగా రిపోర్టింగ్ చేయగలరు. అయితే ఓ ఏడేళ్ల బాలుడు రిపోర్టింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి రిపోర్టింగ్ చూసిన సీఎం ఆ బాలుడిని మెచ్చుకుంటూ ఆ వీడియో షేర్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌ సేనాపతి జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అయితే సీఎం పర్యటన, ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రాంరంభోత్సవాన్ని ఓ బాలుడు భవనం మీది నుంచి వీడియోలో మాట్లాడుతూ వివరించాడు. రిపోర్టింగ్ లో ఎంతో నైపుణ్యం ఉన్న వారిలా ఆ బాలుడు రిపోర్టింగ్ చేశాడు.

ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా రిపోర్టర్ లాగా చేతులు ఆడిస్తూ ఈ రోజు మనం రాష్ట్ర సీఎం కింద కనిపిస్తున్న స్థలంలో హెలికాప్టర్‌లో దిగటం చేస్తున్నాము. మీకు హెలికాప్టర్‌ కనిపించడం లేదు కాదా.. చూపిస్తాం. సీఎం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. కోవిడ్‌ను నియంత్రించడంలో ఇదో ముందడుగు’ అని చక్కగా మాట్లాడుతూ వివరించాడు. అనంతరం సీఎం హెలికాప్టర్‌ టేకాఫ్ అవుతుండగా చూపిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సీఎం ఎన్‌ బిరెన్‌ జీ. చాలా గర్వంగా ఉంది. మీరు మళ్లి రావాలని కోరుకుంటున్నాం’ అంటు మాట్లాడాడు.

ఇక హెలికాప్టర్ గాలిలో ఎగరటంతో ఈలలు వేస్తూ టాటా చెబుతాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో సీఎం కంటపడింది. దీంతో ఆయన దీనిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి బాలుడిని అభినందించాడు. అతను నేను మంగళవారం సేనాపతి జిల్లాలోని ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన కార్యకమాన్ని చాలా చక్కగా రిపోర్టింగ్‌ చేశాడు’ అని కాప్షన్‌ రాశారు.

సీఎం వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఆ వీడియో చూసిన వారు ఆ బాలుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అంత చిన్న వయసులో ఇది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారు నెటిజన్లు. కాగా బాలుడు హిందీ ఇంగ్లీష్ భాషలను వాడుతూ అద్భుతంగా రిపోర్టింగ్ చేశాడు.