Covid Vaccine wastage: చెత్తకుప్పలో కరోనా టీకాలు: విచారణకు ఆదేశించిన అధికారులు

పదుల సంఖ్యలో కోవిడ్ టీకాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నగరంలో వెలుగు చూసింది. కన్నౌజ్ లోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో కరోనా టీకాలు బాక్సులతో సహా చెత్తకుప్పలో పడేసి ఉన్నాయి

Covid Vaccine wastage: చెత్తకుప్పలో కరోనా టీకాలు: విచారణకు ఆదేశించిన అధికారులు

Vaccine

Covid Vaccine wastage: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేస్తుంటే..మరో వైపు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వృధా కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది. పదుల సంఖ్యలో కోవిడ్ టీకాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నగరంలో వెలుగు చూసింది. కన్నౌజ్ లోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో కరోనా టీకాలు బాక్సులతో సహా చెత్తకుప్పలో పడేసి ఉన్నాయి. అది గమనించిన స్థానికులు కొందరు..జిల్లా ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. “చెత్తకుప్పలో కరోనా టీకాలు” అనే వార్త సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తం అయిన జిల్లా ప్రధాన వైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్..విచారణకు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ..టీకా వృధా వ్యవహారం ఎంతో తీవ్రమైన ఘటనగా పేర్కొన్నారు.

Also read:Temple in Railway station: రైల్వే స్టేషన్లో ఆలయం: తొలగిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమన్న హిందూ సంఘాల ప్రతినిధులు

దీనిపై పూర్తి స్థాయిలో విచారం అజరిపి భాద్యులపై చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క బాక్స్ లో (వయాల్) పది టీకాలు ఉంటాయి. ఆరోగ్య కేంద్రంలో టీకా కోసం వచ్చే వారి సంఖ్యను భట్టి ఎప్పటికప్పుడు కొత్త బాక్స్ తెరుస్తుంటారు సిబ్బంది. ఆ సమయంలో బాక్స్ లో మిగిలిన టీకాలు ఉంటే..వాటిని పక్కన పెడతారు. అయితే సీల్ వేసిన టీకా బాక్సులే ఇలా చెత్తకుప్పలో పడి ఉండడంపై ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తుంది. మరోవైపు..ఇటీవల కరోనా టీకా రెండో డోస్ తీసుకోకపోయినా..తీసుకున్నట్టు తమకు మెసేజ్ లు వస్తున్నాయని.. కన్నౌజ్ లోని స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తం అవుతుంది.

Also read:Summer Heat Waves : భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం