Telangana Rains : అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.

Telangana Rains : అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు

Rains (1)

Telangana Rains : తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో దిగులుతో ఉన్న రైతులపై రబీ సీజన్‌ ప్రారంభంలో కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

Kartarpur : దేశ విభజనతో దూరమయ్యారు.. 74 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి పంటకు భారీ నష్టం జరిగింది. అకాల వర్షాలు హనుమకొండ జిల్లా రైతులకు కష్టాలు మిగిల్చాయి. మిర్చి, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. పంటలు నేలపాలయ్యాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.