Varun Gandhi: జాతీయ జెండా కొనకుంటే రేషన్ బంద్.. వరుణ్ గాంధీ ఆగ్రహం

జాతీయ జెండాను కొనని వారికి రేషన్ సరుకులు ఇవ్వకపోవడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఘనంగా జరుపుకోవాల్సిన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేదలపై భారం మోపకూడదన్నారు.

Varun Gandhi: జాతీయ జెండా కొనకుంటే రేషన్ బంద్.. వరుణ్ గాంధీ ఆగ్రహం

Varun Gandhi: ఘనంగా జరుపుకోవాల్సిన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేదలపై భారం మోపకూడదని అన్నారు బీజేపీ నేత వరుణ్ గాంధీ. హరియాణాలో జాతీయ జెండాను కొనుక్కోలేదని, కొందరు పేదలకు రేషన్ సరుకులు ఇచ్చేందుకు నిరాకరించడంపై వరుణ్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

హరియాణాకు సంబంధించి ఒక మీడియా సంస్థ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. పేదలు రేషన్ సరుకులు కావాలంటే అదనంగా రూ.20 చెల్లించి జాతీయ జెండాను కూడా కొనుక్కోమని అక్కడ షరతు పెట్టారు. జాతీయ జెండాను కొనుక్కోనందుకు రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ వీడియోపై వరుణ్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘దేశ 75వ స్వాతంత్ర వేడుకలు పేదలకు భారంగా మారడం సరికాదు. పేదలు రేషన్ సరుకులు కావాలంటే జాతీయ జెండాను కొనుక్కోవాలనే షరతు పెడుతున్నారు. జాతీయ జెండా ప్రతి భారతీయుడి హృదయంలో ఉంటుంది. అలాంటి జెండా పేరుతో అదనపు భారం మోపుతున్నారు. అది కూడా వారి ఆహారాన్ని తీసుకుని’ అని వరుణ్ ట్వీట్ చేశారు. రేషన్ సరుకుల కోసం వచ్చే వారికి జాతీయ జెండాను రూ.20 లకు అమ్మాలని తనను అధికారులు ఆదేశించినట్లు సరుకులు ఇచ్చే వ్యక్తి చెప్పాడు.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ స్క్రీన్‌షాట్స్ తీయడం కష్టం

ఈ జాతీయ జెండాలను ఇండ్లపై ఎగరేసుకోవాలని చెప్పారన్నాడు. అధికారులు చెప్పినదాని ప్రకారమే జెండా కొనని వారికి సరుకులివ్వడం లేదన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. రేషన్ షాప్ లైసెన్స్ రద్దు చేశారు. అందరికీ జెండాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే జెండాల్ని రేషన్ షాపుల్లో అమ్ముతున్నట్లు, అవసరమైన వారు మాత్రమే కొనుక్కోవాలి అని ఉన్నతాధికారులు చెప్పారు.