Pallonji Mistry: వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Pallonji Mistry: వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

Pallonji Mistry: ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. 93 సంవత్సరాల మిస్త్రీ సోమవారం అర్ధరాత్రి నిద్రలోనే మరణించినట్లు పల్లోంజీ మిస్త్రీ ప్రతినిధులు వెల్లడించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) అనే వ్యాపార సంస్థను ప్రస్తుతం మిస్త్రీ కుటుంబం నిర్వహిస్తోంది.

AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ఒకటి. 50 దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పల్లోంజీ 29 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉంటారని అంచనా. మరో ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూపులో పల్లోంజీ 18.37 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉన్నారు. తండ్రి మరణంతో 18 ఏళ్ల వయసులోనే పల్లోంజీ.. ఎస్‌పీ గ్రూపు నిర్వహణా బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాణ రంగంలో ఈ సంస్థను అగ్రగామిగా నిలిపారు. అనేక ప్రతిష్టాత్మక నిర్మాణాలను ఈ సంస్థే చేపట్టింది. దేశంలో ఆర్‌బీఐ బిల్డింగ్, హెచ్ఎస్‌బీసీ, తాజ్, ఒబెరాయ్ వంటి హోటళ్లను ఈ సంస్థే నిర్మించింది. స్థిరాస్తి, టెక్స్‌టైల్స్, షిప్పింగ్, హోమ్ అప్లయెన్సెస్ వంటి అనేక వ్యాపారాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

Nikki Tamboli : కొత్త కారుతో నిక్కీ తంబోలి ఫోజులు

వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పల్లోంజీ మృతికి రాష్ట్రపతి, ప్రధానితోపాటు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం ప్రకటించారు.