Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..

శేఖర్ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశం లో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''నేను దుబాయ్ లో ఉంటాను, శేఖర్ సినిమాను నిర్మించాను. నా సినిమాను ఆపేసి...............

Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..

Shekar Movie

Shekar Movie :  జీవిత, రాజశేఖర్ గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో శేఖర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అనేక వాయిదాల అనంతరం మే 20న విడుదల చేశారు. కాని విడుదల అయిన మూడు రోజులకే జీవిత మాకు డబ్బులు ఇవ్వాలి అప్పటివరకు సినిమాని ఆపండి అంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఇప్పటికే దీనిపై జీవిత, రాజశేఖర్ స్పందించగా తాజాగా ఈ సినిమా నిర్మాత ఈ వివాదంపై స్పందించారు.

శేఖర్ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశం లో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ”నేను దుబాయ్ లో ఉంటాను, శేఖర్ సినిమాను నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా వద్దే ఉన్నాయి. సినిమాలో శివానీ శివాత్మికల పేరు మాత్రమే ఉంది, వాళ్లు నిర్మాతలు కాదు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే సినిమా ఆగిపోయింది. శేఖర్ సినిమా ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓ లపై న్యాయపోరాటం చేస్తాను. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం”

Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్‌లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..

 

”అసలు నాకు పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియదు. శేఖర్ సినిమాకు నేను రూ. 15 కోట్లు పెట్టుబడి పెట్టాను. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్స్ ఇస్తారా? ఇది రాజశేఖర్ సినిమా కాదు రాజశేఖర్ నటించిన సినిమా. జీవిత సినిమాకాదు జీవిత రాజశేఖర్ దర్శకత్వం చేసిన సినిమా. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా నా పేరు మీదే ఉంది. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు” అని తెలిపారు. మరి రేపు కోర్టులో ఏ తీర్పు వస్తుందో చూడాలి. ఈ వివాదాలు ఎప్పుడు సద్దుమణుగుతాయో చూడాలి మరి.