Lok Sabha elections-2024: ఎన్నికల ముందు రాజకీయాల్లోకి శిఖర్ ధావన్?

తాను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తానని ధావన్ అన్నాడు. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని తనకు తెలుసని అన్నాడు.

Lok Sabha elections-2024: ఎన్నికల ముందు రాజకీయాల్లోకి శిఖర్ ధావన్?

Shikar Dhavan

Lok Sabha elections-2024: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ రాజకీయాల్లోకి రానున్నాడా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ మాట్లాడుతుండగా ఆయనను రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరి ప్రశ్నించారు.

దీంతో శిఖర్ ధావన్ స్పందిస్తూ… “ఇప్పటివరకైతే నేను అటువంటి ప్రణాళికలు వేసుకోలేదు. అయితే, నేను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తాను. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తాను. కచ్చితంగా విజయం సాధిస్తానని నాకు తెలుసు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను కష్టపడి పనిచేస్తున్నాను.

ప్రతి రంగంలోనూ ఇటువంటి సక్సెస్ మంత్ర ఉంటుంది. రాజకీయాల్లో చేరే విషయంపై నేను ఇప్పటివరకూ ఎక్కడా మాట్లాడలేదు. అయితే, దేవుడి సంకల్పం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నేను రాజకీయాల్లోకి రావాలని దేవుడు సంకల్పిస్తే నేను తప్పకుండా విజయం సాధిస్తాను” అని చెప్పాడు.

కాగా, వన్డే జట్టులో తాను స్థానాన్ని కోల్పోవడం, తన స్థానంలో శుభ్ మన్ గిల్ ఆడుతుండడంపై కూడా ధావన్ స్పందించాడు. ఒక వేళ తాను సెలెక్టర్ ను అయినప్పటికీ తాను కూడా శుభ్ మన్ గిల్ నే ఎంపిక చేస్తానని చెప్పాడు. శుభ్ మన్ గిల్ చాలా బాగా ఆడుతున్నాడని తెలిపాడు.

WPL Final 2023 : తొలి WPL టైటిల్ విజేత ముంబై ఇండియన్స్