Shikhar Dhawan: రిషబ్ పంత్‌కు అండగా కెప్టెన్ శిఖర్ ధావన్.. ఏమన్నాడంటే?

రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్తున మద్దతు లభిస్తుంది. దీనిపై స్పందించిన ధావన్..

Shikhar Dhawan: రిషబ్ పంత్‌కు అండగా కెప్టెన్ శిఖర్ ధావన్.. ఏమన్నాడంటే?

Shikar Dhavan

Shikhar Dhawan: మైదానంలో పరుగులు రాబట్టడంలో వైఫల్యం చెందుతూ సతమతమవుతున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిషబ్ పంత్‌ను పక్కకు తప్పించి అతని స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అన్నివైపుల నుంచి తన పేలవ బ్యాటింగ్‌పై విమర్శలపాలవుతున్న పంత్‌కు టీమిండియా స్టాండ్-ఇన్ కెప్టెన్ శిఖర్ ధావన్ అండగా నిలిచాడు. రిషబ్ పంత్ నిరూపితమైన మ్యాచ్ విన్నర్ అంటూ కితాబిచ్చాడు.

Rishabh Pant vs Sanju Samson: సంజూ వర్సెస్ రిషబ్.. వీరిలో ఎవరు గ్రేట్..! న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ వేళ ఆసక్తికర చర్చ..

రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్తున మద్దతు లభిస్తుంది. దీనిపై స్పందించిన ధావన్.. సంజూ శాంసన్ ను అవకాశాలకోసం వేచి ఉండాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నాడు.

Rishabh Pant: ఓపెనర్‌గా వెళ్లినా విఫలమయ్యాడు..! క్రికెటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై మండిపడుతున్న ఫ్యాన్స్

ఇదిలాఉంటే బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే లో 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి పంత్ పెవిలియన్ బాటపట్టాడు. ధావన్ మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటరాక్షన్‌లో ఈ విషయంపై మాట్లాడుతూ.. రెండు వైట్-బాల్ ఫార్మాట్లలో తన చివరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో పంత్ స్కోర్‌లు 10, 15, 11, 6, 6, 3, 9, 9, 27 మాత్రమే చేశాడు. కానీ, శాంమ్సన్ కొద్దిపాటి అవకాశాలు దక్కింనా రాణిస్తూ వచ్చాడు. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో కేరళ స్టంపర్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. శాంసన్‌పై పంత్‌ను ఎంపిక చేయడం వంటి గమ్మత్తైన ఎంపికలు చేస్తున్నప్పుడు కెప్టెన్ నిర్ణయాలు తీసుకోవటం కొంచెం కష్టమే అని ధావన్ అన్నాడు. అయితే, సంజూ శాంసన్ తనకు లభించిన ఏ అవకాశంలోనైనా బాగా రాణిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి ఉండాల్సి వస్తుంది అంటూ ధావన్ పేర్కొన్నాడు.