BiggBoss : కమల్ తప్పుకోవడంతో బిగ్‌బాస్‌ హోస్ట్‌గా మరో స్టార్ హీరో..

తమిళ్ బిగ్‌బాస్‌ కి ఎప్పటిలాగే కమల్ హాసన్ హోస్ట్ గా చేశారు. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల బిగ్‌బాస్‌ షో నుంచి హోస్ట్ గా తప్పుకున్నారు కమల్. దీంతో ఆయన స్థానాన్ని.........

BiggBoss : కమల్ తప్పుకోవడంతో బిగ్‌బాస్‌ హోస్ట్‌గా మరో స్టార్ హీరో..

Shimbu

BiggBoss :  బిగ్‌బాస్‌ అన్ని భాషల్లో ఆదరణ తెచ్చుకుంటుంది. తెలుగులో బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమవనుంది. తమిళ్ లో మాత్రం ఇప్పటికే ప్రారంభమై 25 రోజులు అయింది. తమిళ్ బిగ్‌బాస్‌ కి ఎప్పటిలాగే కమల్ హాసన్ హోస్ట్ గా చేశారు. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల బిగ్‌బాస్‌ షో నుంచి హోస్ట్ గా తప్పుకున్నారు కమల్. దీంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా తమిళ్ బిగ్‌బాస్‌ అల్టిమేట్ ఓటీటీ షోకి కొత్త హోస్ట్ ని అనౌన్స్ చేశారు.

Hamsanandini : కీమో నుంచి కోలుకున్నాను.. కానీ.. తన క్యాన్సర్ చికిత్సపై హంసా నందిని పోస్ట్

కమల్ తప్పుకోవడంతో గత సీజన్ లో గెస్ట్ హోస్ట్ గా చేసిన రమ్యకృష్ణ ని తీసుకొస్తారని అంతా అనుకున్నారు. కానీ రమ్యకృష్ణ నో చెప్పడంతో మరో తమిళ స్టార్ హీరోని ఫైనల్ చేశారు నిర్వాహకులు. ఈ మేరకు ఇవాళ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ బిగ్‌బాస్‌ అల్టిమేట్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు అధికారికంగా తెలిపారు. డిస్నిప్లస్ హాట్ స్టార్ లో 24/7 లైవ్ టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్‌ అల్టిమేట్ తమిళ్ రియాల్టీ షోకి శింబు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మరి శింబు హోస్ట్‌గా ఎలా అలరిస్తాడో, ప్రేక్షకులని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.