Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్.. షిండే వర్గానికి మద్దతు తెలిపిన ఉద్ధవ్ మేనల్లుడు

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు.

Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్.. షిండే వర్గానికి మద్దతు తెలిపిన ఉద్ధవ్ మేనల్లుడు

Nihar Thackeray With Maharashtra Cm Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు. మెజార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగురవేసి ఏకంగా మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చున్న షిండే.. శివసేన పార్టీ మాదే అంటూ ఉద్ధవ్ కు కొరకరానికొయ్యలా మారాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు.

Eknath Shinde: షిండే భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు, సోదరుడు దివంగత బిందు మాధవ్ ఠాక్రే కుమారుడు నిహార్ ఠాక్రే శువారం శివసేన తిరుగుబాటు సేన నాయకుడు-మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మారిన ఏక్నాథ్ షిండేను కలుసుకుని తన మద్దతును అందించారు . శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనవడు ముంబైలో అడ్వకేట్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి బిందుమాధవ్ 1996లో ప్రమాదంలో మరణించారు.

Eknath Shinde : ఎవరీ ఏక్‌నాథ్ షిండే..? రిక్షా, టెంపో డ్రైవర్‌ నుంచి..‘మహా’రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎలా చేరుకున్నారంటే..!

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి (MVA) కూటమికి వ్యతిరేకంగా, శివసేన ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో షిండే తిరుగుబాటు చేశాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలడానికి దారితీసింది. షిండే ఇచ్చిన షాక్ తో జూన్ 30న మహారాష్ట్ర సిఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరుసటి రోజే ఏక్ నాథ్ షిండే బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలాఉంటే శివసేన పార్టీ మాదే అంటూ షిండే వాదిస్తున్నాడు. ఉద్ధవ్ వద్ద కొద్ది మంది ఎమ్మెల్యేలే ఉన్నారంటూ, నా వద్దనే అత్యధికంగా శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, పైగా పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలను మేమే కొనసాగిస్తున్నామంటూ పేర్కొంటున్నారు.