Viral Video: సీన్ రివర్స్..అంత పెద్ద పాముని గులాబ్ జామ్ లా గుటుక్కున మింగేసిన చేప

వామ్మో..సీన్ రివర్స్ అయ్యింది. పాములు చేపల్ని తినటం చూశాం. కానీ ఇక్కడ ఓ చేప అంతపెద్ద పాముని గులాబ్ జామ్ లా గుటుక్కున మింగేసింది.

Viral Video: సీన్ రివర్స్..అంత పెద్ద పాముని గులాబ్ జామ్ లా గుటుక్కున మింగేసిన చేప

How This Fish Swallowed Long Snake Snake

Fish Swallows  Long Snake: ఈ ప్రకతిలో జీవికి జీవే ఆహారం. పాములు చేపల్ని..కప్పల్ని తింటాయి. కానీ ప్రకృతిలో కొన్ని వింతలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. సాధారణం పాములు చేపల్ని..కప్పల్ని తింటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ భారీ పాముని ఓ చేప ఏదో గులాబ్ జామ్ మింగినట్లుగా గుటుక్కున మింగేసింది. పాపం ఆ పాము చేప నోటినుంచి తప్పించుకోవటానికి నానా తంటాలు పడింది.కానీ చేప దాన్ని వదల్లేదు సరికదా ఉడుం పట్టు పట్టి లటుక్కున మింగేసింది. ఏకంగా మూడున్నర అడుగుల పాముని ఓ చేప మింగేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలా పాముని మింగేసిన ఈ చేప రికార్డు క్రియేట్ చేసింది. హా..ఈ రికార్డులు రివార్డులు మేం ఏం చేసుకుంటాం..మాకు నిండాల్సింది పొట్ట. మీరు ఏదైనా చేస్కోండి..ఏదైనా రాస్కోండీ..ఏ రికార్డు అయినా ఇచ్చుకోండీ నాకేంటీ..అన్నట్లుగా అంత పెద్ద భారీ పాముని మింగేసిన ఆ చేప దాని పని అది కానిచ్చుకుని కూల్ గా నీళ్లల్లోకి జారిపోయింది. బహుశా కడుపు భలే నిండింది ఇవాళ్ల..ఈరోజుకి ఇక వేటాడే పనేలేదున్నట్లుగా..లేదా మరో పాముని దొరబుచ్చుకోవటానికో గానీ కామ్ గా నీళ్లలోకి జారిపోయిందా చేప..ఒడ్డున నీళ్లలో ఉన్న ఓ చేప..పొదల్లో నుంచి నీళ్లలో తలను పెట్టిన పామును స్లోగా మింగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయటంతో వైరల్‌ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

;