Shruti Haasan: సీనియర్స్ సూపర్ ఛాయిస్‌గా శృతిహాసన్

కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనిపించుకుంది. గబ్బర్ సింగ్ తో కొన్నాళ్లు లక్కీఛార్మ్ గా వెలిగింది. ఫ్లాప్స్, పర్సనల్ ఇష్యూస్ తో శ్రుతీహాసన్ ఆమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది.

Shruti Haasan: సీనియర్స్ సూపర్ ఛాయిస్‌గా శృతిహాసన్

Shruti Haasan

Shruti Haasan: కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనిపించుకుంది. గబ్బర్ సింగ్ తో కొన్నాళ్లు లక్కీఛార్మ్ గా వెలిగింది. ఫ్లాప్స్, పర్సనల్ ఇష్యూస్ తో శ్రుతీహాసన్ ఆమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది. కట్ చేస్తే.. కొవిడ్ టైమ్ లో సూపర్ హిట్స్.. ఇప్పుడు బంపర్ ఆఫర్స్.. సీనియర్స్ సూపర్ ఛాయిస్ గా మారిన శ్రుతీ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది.

Shruti Haasan : మెగాస్టార్‌కి జోడిగా కమల్ కూతురు..

శ్రుతీహాసన్ ఇప్పుడు సీనియర్స్ బెస్ట్ ఛాయిస్. ప్రస్తుతం హిట్ ఫేజ్ నడుస్తోన్న ఈ హీరోయిన్ వరుసగా సీనియర్ హీరోలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతినే హీరోయిన్. కాగా రీసెంట్ గా చిరూ 154వ ప్రాజెక్ట్ కూడా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేసింది. బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్ అని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. బాలయ్య, చిరూ ఇద్దరితో శ్రుతీ నటిస్తోన్న ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేసేది మైత్రీ మూవీ మేకర్స్.

Shruti Haasan-Tamannaah: సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్లు

కెరీర్ స్టార్టింగ్ లో శ్రుతిపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. గబ్బర్ సింగ్ ఇచ్చిన ఉత్సాహంతో శ్రీమంతుడు, బలుపు హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకుంది. మళ్లీ ఫ్లాప్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయిన ఈ హీరోయిన్ క్రాక్ తో కమ్ బ్యాక్ అనిపించుకుంది. ఆపై చిన్న రోల్ చేసినా పవన్ వకీల్ సాబ్ హిట్.. తన లిస్ట్ లోకి చేరిపోయింది.

Shruti Haasan : ప్రభాస్ ప్రేయసి ‘ఆద్య’ గా శృతి హాసన్..

అన్నింటికి మించి అన్న లెవెల్ లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆఫర్ అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచింది శ్రుతీహాసన్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఆమె క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండబోతుంది. ఇక లేటెస్ట్ గా అమెజాన్ లో రిలీజైన బెస్ట్ సెల్లార్ వెబ్ సిరీస్ కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక నాన్న కమల్ హాసన్ బ్యాచ్ అయిన బాలయ్య, చిరూ వంటి టాలీవుడ్ సీనియర్స్ పక్కన్న ఛాన్స్ లు కొట్టేస్తూ… తీరిక లేకుండా గడిపేయడం ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.