Sid Sriram: ఎక్కడ విన్నా సిద్ పాటే.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఎవరు పాడితే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయో, ఏ పాట వింటే ఆడియన్స్ కాన్సన్ ట్రేషన్ సినిమా మీదకి షిఫ్ట్ అవుతుందో బాగా తెలుసుకున్నారు.

Sid Sriram: ఎక్కడ విన్నా సిద్ పాటే.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

Sid Sriram

Sid Sriram: ఎవరు పాడితే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయో, ఏ పాట వింటే ఆడియన్స్ కాన్సన్ ట్రేషన్ సినిమా మీదకి షిఫ్ట్ అవుతుందో బాగా తెలుసుకున్నారు మేకర్స్. అందుకే ఏరికోరి మరీ తమ సినిమాల్లో ఈ సూపర్ సింగర్ సిద్ శ్రీరామ్ తో పాట పాడించుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏ సినిమాకి పాడినా, ఏ హీరోకి పాడినా.. ఆ పాట అక్షరాలా లక్షల వ్యూస్ తో దూసుకుపోవడమే. మరి ఈ పాటలు పాడినందుకు సిద్ శ్రీరామ్ ఎన్ని లక్షలు తీసుకుంటారో తెలుసా..?

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

ఈ పాట సిద్ శ్రీరామ్ పాడకపోతే.. ఏదో సినిమాలో ఉన్న మిగతా పాటలతోపాటు ఒక పాటగా కలిసిపోయేది. కానీ.. సిద్ శ్రీరామ్ తన గొంతుతో ఈ పాటను సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ చేశాడు. పాట ఎలాంటి దైనా ఫీల్ తో మెలొడియస్ గా పాడటం సిధ్ శ్రీరామ్ స్పెషాలిటీ అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా సిద్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. అంత స్టార్ సింగర్ కాబట్టే సిద్ కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Sidharth – Saina: సైనాకు సిద్ధార్థ్ సారీ..!

సిద్ శ్రీరామ్ పాట పాడితే.. ఆ పాట హిట్ అవ్వడం గ్యారంటీ. అందుకే ఎన్ని లక్షలిచ్చైనా సరే తమ సినిమాలో పాడించుకుంటున్నారు మేకర్స్. అయితే సిద్ కూడా తన క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. సిద్ ఒక్క పాట పాడడానికి ఎక్స్ పెక్ట్ చేసేది యావరేజ్ 8 లక్షలు. అయితే అది బ్యానర్ ని బట్టి, స్టార్ కాస్ట్ ని బట్టి మారుతూ ఉంటుంది. 6 నెలల క్రితం 6 లక్షలు చార్జ్ చేసిన సిద్.. ప్రస్తుతం 7 లక్షలకు మాత్రం తగ్గనంటున్నారు.

Sree Leela : నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’లో రాణి ఈమె?

చిన్న సినిమాలకు మాత్రం కాస్త అటు ఇటూగా తీసుకునే సిద్ శ్రీరామ్.. పెద్ద సినిమాలకు మాత్రం 10 లక్షలు ఫిక్స్ డ్ గా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ లో 4 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ స్టార్ సింగర్.. వరస ఆఫర్లతో పాటు.. వరస బ్లాక్ బస్టర్ హిట్స్ సంపాదించడంతో రేట్ కూడా పెంచేశారు. ఒకప్పుడు వరుస పెట్టి పాటలు పాడేసిన సిద్.. ఇప్పుడుసెలక్టివ్ గా పాటలు పాడుతున్నారు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం.. తగ్గేదే లే అంటున్నారు. చిన్న సినిమాలకు మినిమం 5 లక్షలతోపాటు జిఎస్ టీ కూడా కలెక్ట్ చేస్తున్న సిద్.. ఈ సినిమాలకు కూడా తన గొంతుతో మంచి మైలేజ్ తో పాటు క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. అందుకే ఎంతైనా పర్లేదు.. సిద్ కావాల్సిందే అని ఏరికోరి పాటలు పాడించుకుంటున్నారు మేకర్స్.