Lata Mangeshkar covid : గాయని లతా మంగేష్కర్‌కు కరోనా..ఐసీయూలో చికిత్స
భారతరత్న అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్ధారణ కారవటంతో లతా మంగేష్కర్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు

Lata Mangeshkar Covid Positive (1)
Lata Mangeshkar covid Positive : భారతరత్న అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్ధారణ కారవటంతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ లక్షణాలు స్పల్పంగానే ఉన్నా ఆమెకు 92 ఏళ్లు కావటంతో ముందు జాగ్రత్తగా లతా మంగేష్కర్ ఆస్పత్రిలో చేర్పించామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యాన్ని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం మేరకు చికిత్స అందిస్తున్నారు.
Read more : Omicron India : దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
కాగా..లతా మంగేష్కర్‌కు 2019లో వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడటంతో శ్వాస సంబంధ సమస్యలు రావటంతో కొంతకాలంపాటు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందారు. సెప్టెంబర్ 28 లతా మంగేష్కర్ పుట్టిన రోజు ఈ క్రమంలో 2020లో లతా 92వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. 7 దశాబ్దాల పాటు లతా మంగేష్కర్ ఆమె గాన మాధుర్యంతో అలరించారు. ఎన్నో వేలాది పాటలకు ప్రాణంపోశారు. వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో వేలాది పాటలు పాడారు.
Read more : Coronavirus: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
ప్రాంతీయ భాషల్లోనే కాకుండా.. విదేశీ భాషల్లోనూ లతా మంగేష్కర్ పాటలు ఆలపించి.. వరల్డ్ మ్యూజిక్ లవర్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. 2001లో లతా మంగేష్కర్‌ను భారతరత్న అవార్డు వరించింది. ఈ అవార్డుతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పలు జాతీయ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. ఆమె గానామృతానికి ఎంతోమంది అభిమానులున్నారు. గత ఏడాది ఆమె పుట్టిన రోజుకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.