Coronavirus: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.

Coronavirus: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Corona 11zon (1)

Coronavirus: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. అయితే, ఈరోజు(11 జనవరి 2022) మాత్రం నిన్నటితో పోలిస్తే, కాస్త కరోనా కేసులు తగ్గాయి. అయితే మరణాలు మాత్రం పెరిగాయి.

గత 24 గంటల్లో 1 లక్ష 68 వేల 63 కొత్త కేసులు నమోదు కాగా 277 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కరోనా కేసులు 6.4 శాతం కేసులు తగ్గాయి. సోమవారం(10వ తేదీ) లక్షా 79వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 69వేల 959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా సోకిన కేసుల సంఖ్య 3కోట్ల 58 లక్షల 75 వేల 790కి పెరిగాయి. కాగా, ఈ మహమ్మారి కారణంగా 4 లక్షల 84 వేల 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 45 లక్షల 70 వేల 131 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.

ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ వచ్చిన తర్వాత, క్రియాశీల రోగుల సంఖ్య 8 లక్షల 21 వేల 446కి పెరిగింది. సోమవారం, భారతదేశంలో 15,79,928 కరోనా వైరస్ నమూనా పరీక్షలు జరగ్గా.. మొత్తం 69 కోట్ల 31 లక్షల 55 వేల 280 నమూనా పరీక్షలు జరిగాయి.

ప్రస్తుతం 8,21,446 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో 4వేల 461 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.