Ramarao On Duty: మాస్ రాజా కోసం మాస్ డైరెక్టర్స్..!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ....

Ramarao On Duty: మాస్ రాజా కోసం మాస్ డైరెక్టర్స్..!

Six Directors To Grace Ramarao On Duty Trailer Launch

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మరోసారి మాస్ రాజా రెడీ అవుతున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Ramarao On Duty: ‘రామారావు ఇన్ యాక్షన్’ మేకింగ్ వీడియో

అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూలై 16న సాయంత్రం 6 గంటల నుండి పార్క్ హయత్ లో ఈ ట్రైలర్ లాంఛ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ కు ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు మాస్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Ramarao On Duty: రామారావు ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ, నక్కిన త్రినాథ రావు, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకకు హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో రవితేజతో పాటు వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.