Maa Elections : మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పు
మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు జరిగాయి. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు.

Maa Elections
Maa Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పోటీలో ఉన్న రెండు ప్యానెళ్లలోని సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని మాలోని లొసుగులన్నీ బయటపడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి హేమ విమర్శలు ఎక్కుపెడుతుండగా, విష్ణు ప్యానల్ నుంచి కరాటే కళ్యాణి అదే రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.
వీరి విమర్శలను పక్కన పెడితే మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పు జరిగింది. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 10న పోలింగ్ జరగనుండగా.. 11న వాటి ఫలితాలు వెల్లడవుతాయి. ఇందుకు సంబందించిన ప్రెస్ నోట్ ను మా ఎన్నికల అధికారి విడుదల చేశారు.
Read More : MAA Election: విష్ణు నా క్రమశిక్షణకి వారసుడు.. ఓటేయాలని మోహన్ బాబు లేఖ!