Piles Disease : మూల వ్యాధికి ముల్లంగితో పరిష్కారం!

ముల్లంగి జీర్ణ క్రియలను వేగవంతం చేయటంలో తోడ్పడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటంతో మలాన్ని మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే వోలాటైల్ అయిల్స్ వల్ల పైల్స్ వల్ల కలిగి మంట, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

Piles Disease : మూల వ్యాధికి ముల్లంగితో పరిష్కారం!

Piles Disease : స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపించే సమస్య పైల్స్. పురీషనాళం నుండి రక్త స్రావం, ప్రేగు కదలికల్లో ఇబ్బందులు పైల్స్ సమస్యలో ఎదురవుతాయి. దీని వల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యం వంటి పరిస్ధితి ఉంటుంది. అయితే ఈ పైల్స్ కు సాధారణ గృహ చికిత్సలతో కొన్ని సార్లు ఉపశమనం పొందవచ్చు. పైల్స్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారికి ముల్లంగి ప్రభావవంతంగా పనిచేస్తుంది. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూనే ముల్లంగిని తీసుకుంటూ పైల్స్ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

ముల్లంగి జీర్ణ క్రియలను వేగవంతం చేయటంలో తోడ్పడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటంతో మలాన్ని మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే వోలాటైల్ అయిల్స్ వల్ల పైల్స్ వల్ల కలిగి మంట, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పైల్స్ సమస్య ప్రారంభంలో ఉన్నవారికి ఇది ముల్లంగి మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. ముల్లంగి రసాన్ని తొలుత పావు కప్పుతో ప్రారంభించి మెల్లమెల్లగా రోజుకు అరకప్పు ముల్లంగి రసం తీసుకుంటే పైల్స్ సమస్య నుండి బయటపడవచ్చు.

అలాగే తెల్లముల్లంగి ముక్కను తీసుకుని బాగా గ్రైండ్ చేసి అందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని రోజుకు రెండు పర్యాయాలు తీసుకోవాలి. ఇలా చేస్తే మలబద్ధకం సమస్య పోతుంది. ముల్లంగి ఆకులను తీసుకుని కడిగి నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ నెల రోజులపాటు తీసుకోవాలి. తెల్ల ముల్లంగిని పేస్ట్‌లా చేసి, అందులో కొంత పాలు కలపండి. నొప్పి మరియు వాపు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి. తేనె , ముల్లంగి పేస్ట్ ను కలిపి మొలలకు పై పూతగా రాసుకోవాలి. ఇలా చేస్తే కొంత మేర ఉపశమనం లభిస్తుంది.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.