Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ .. గులాబీ గూటిలో కీలక బాధ్యతలు

సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా నమ్మినబంటుగా పేరున్న సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ షురూ కానుంది. ఇక గులాబీ గూటిలో గులాబీ బాస్ ఆదేశాల మేరకు మాజీ సీఎస్ పనిచేయనున్నారు.

Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ .. గులాబీ గూటిలో కీలక బాధ్యతలు

Somesh Kumar

Somesh Kumar: మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు రాజకీయాల్లోకి రావటం సర్వసాధారణమే. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? తెలంగాణ ప్రభుత్వానికి సేవలందించిన మాజీ సీఎస్ ఇక గులాబీ గూటికి చేరనున్నారా? అంటే నిజమేననిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా నమ్మినబంటుగా పేరున్న సోమేశ్ కుమార్ తెలంగాణ నుంచి ఏపీకి ట్రాన్సఫర్ అయినా వెళ్లకుండా ఉండటానికి శతవిధాలా యత్నించిన విషయం తెలిసిందే. ఆఖరికి ఎట్టకేలకు న్యాయస్థానం చీవాట్లతో ఏపీ క్యాడర్ కు వెళ్లారు. వీఆర్ఎస్ అయినా తీసుకుంటాగానీ ఏపీకి వెళ్లనంటూ సోమేశ్ కుమార్ చాలా యత్నాలు చేశారు.

హైకోర్టు ఆదేశాలతో ఏపీలో ఆయన రిపోర్ట్ చేయగా..సీఎం జగన్ తనదైన శైలిలోనే ఆయనకు దాదాపు నెల పాటు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌ తీసుకుందామని నిర్ణయించుకున్నారని దానికి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రానట్లుగా తెలుస్తోంది. సోమేశ్ కుమార్ కు ఇంకా ఈ ఏడాది చివరి వరకు సర్వీస్ ఉంది. కానీ బీఆర్ఎస్‌లో చేరేందుకే వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా సమాచారం.

ఈక్రమంలో సోమేశ్ కుమార్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ తో పాటు హాజరుకావటం ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ నిజమేననిపిస్తోంది. సోమేశ్ కుమార్ కు ఉన్న అనుభవంతో సీఎం కేసీఆర్ ఆయను బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు అందించనున్నారని సమాచారం.

తెలంగాణ సీఎస్‌గా పనిచేసిన సోమేష్ కుమార్ ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన అనేక విషయాల్లో పనిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తను చెప్పినట్లుగా చేస్తున్నారనే సోమేశ్ కుమార్ ను తనవద్దే ఉంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తరువాత ఎట్టకేలకు సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి రావటంతో దీంతో ఆయన ఏపీ వెళ్లటానికి ఆసక్తి చూపించపోవటం వంటి పలు పరిణామాల మధ్య హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ వెళ్లటం ఆ తరువాత జగన్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించకపోవటంతో ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని దాన్ని జగన్ ఆమోదించారని బీఆర్ఎస్ లో చేరటానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు వీఆర్ఎస్ తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.