Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసా?

శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన హిందువుల పండుగ..శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే..

Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసా?

Sri Rama Navami 2023

Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన హిందువుల పండుగ..

దశరథ రాముడు, సకల కళా గుణాభిరాముడు అయిన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్టమధ్యాహ్నాం త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు శ్రీ మహా విష్ణువు అవతారం. ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యకలు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. శ్రీమహా విష్ణువు ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు.

శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్నదని, సీతారాముల కళ్యాణం జరిగినది ఇదే రోజున నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముడి జన్మదినం జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే పట్టాభిషేకం కూడా జరుపుతారు.శ్రీరామనవమి పండుగను మన తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణాలో భద్రాచలంలో కొలువైన సీతారామ కళ్యాణ ఉత్సవం ఎంతో ప్రసిద్ది చెందింది. శ్రీరామ నవమి రోజును శ్రీ సీతారాముల కల్యాణాన్ని వీక్షించటానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

శ్రీరామ నవమి రోజున చేసిన వడపప్పు బెల్లంతో చేసిన పానం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ పండుగకు ఇవే ప్రత్యేకతమైనవి. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకమే శ్రీరామనవమి పండుగ ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీరామ నవమి వేడులకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబు అవుతున్నాయి. హిందువులు శ్రీరామ వేడుకలు జరుపుకుని పానం తాగి జై శ్రీరామ్ నినాదాలు చేస్తారు.

రామాయణాలను ఎంతోమంది రాశారు. కానీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే బాగా ప్రసిద్ధి చెందిందిం. ఇంకా మొల్ల రామాయణం,తులసీ రామాయణం వంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతమంది రాసినా శ్రీరాముడి గొప్పతనం గురించే..సీతమ్మ రామయ్యల గురించే..సీతారాములు, రామ లక్ష్మణులు ఇలా ఈ ముగ్గురి గురించే బాగా ప్రసిద్ధి చెందిన కథలు పురాణాల్లో ఉన్నాయి.