Ram Charan: చరణ్‌కు చెడు చేస్తున్న హీరో.. ఎవరంటే?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా....

Ram Charan: చరణ్‌కు చెడు చేస్తున్న హీరో.. ఎవరంటే?

Srikanth To Cheat Ram Charan In Rc 15

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్‌ను అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నాడు.

RC 15 : అవి షేర్ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. త్రండీకొడుకులుగా చరణ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమాలో చరణ్‌ను ఓ హీరో మోసం చేస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

RC 15గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో తండ్రి చరణ్‌కు స్నేహితుడైన శ్రీకాంత్, అతడితో కలిసి ఓ రాజకీయ పార్టీని పెడతారని, ఎన్నికల్లో విజయం సాధించాక రామ్ చరణ్‌ను శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి ఆ రాజీకయ పార్టీని కైవసం చేసుకుంటాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన శ్రీకాంత్‌కు కొడుకు రామ్ చరణ్ ఎలా బుద్ధిచెబుతాడనేది సినిమా కథగా ఉంటుందని తెలుస్తోంది.

Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..

ఏదేమైనా ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్‌లో రాజకీయ నేతగా, ఐఏఎస్ ఆఫీసర్‌గా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న RC 15 కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.