SSMB 28 : మహేష్ 28వ సినిమా పనులు మొదలుపెట్టేసిన త్రివిక్రమ్, తమన్

తాజాగా త్రివిక్రమ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు తమన్. ఈ ఫోటో షేర్ చేస్తూ.. SSMB28 కోసం వ‌ర్క్ స్టార్ట్ చేశామ‌ని, త్రివిక్రమ్ గారితో కలిసి మళ్ళీ వర్క్ చేయడం, మహేష్ గారికి మరో......

SSMB 28 : మహేష్ 28వ సినిమా పనులు మొదలుపెట్టేసిన త్రివిక్రమ్, తమన్

Ssmb28

Mahesh Babu :  ప్రస్తుతం మహేష్ బాబు ఇటీవలే కరోనా నుంచి కోలుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలో ‘సర్కారు వారి పాట’ చివరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించినా తాజాగా అదే డేట్ కి ‘ఆచార్య’ రావడంతో ఆగస్టుకి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు ఒప్పుకున్నారు.

అయితే రాజమౌళి సినిమా కథ ఇంకా రెడీ అవ్వలేదు. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యేవరకు రాజమౌళి నెక్స్ట్ సినిమా మొదలు పెట్టే ఆలోచనలో లేరు. దీంతో ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. గతంలోనే SSMB28 అని ఈ సినిమా ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మాణంలో మహేష్, పూజాహెగ్డే లతో ఈ సినిమాని తెరక్కించబోతున్నారు.

Mahesh Babu : మెగాస్టార్ రాకతో మళ్ళీ వాయిదా పడనున్న ‘సర్కారు వారి పాట’

త్రివిక్రమ్ ఇటీవలే ‘భీమ్లా నాయక్’ పనులు పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారు. దీంతో మహేష్ తో చేయబోయే సినిమా పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా కథ మొత్తం పూర్తయింది. మహేష్ బాబు వస్తే షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసి మహేష్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మ్యూజిక్ పనులు చేపించేస్తున్నారు త్రివిక్రమ్.

Ram Charan : షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయిన RC15

తాజాగా త్రివిక్రమ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు తమన్. ఈ ఫోటో షేర్ చేస్తూ.. SSMB28 కోసం వ‌ర్క్ స్టార్ట్ చేశామ‌ని, త్రివిక్రమ్ గారితో కలిసి మళ్ళీ వర్క్ చేయడం, మహేష్ గారికి మరో సినిమా చేయడం ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంక్రాంతికి మహేష్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదని భాదపడుతున్న టైంలో ఈ అప్ డేట్ అయినా చెప్పారని ఆనందపడుతున్నారు.