Star Heroes Income: హీరోల వందల కోట్ల సంపాదన.. డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలుసా?

ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు. అంతేకాదు.. రోజుకి అంటే ఒక్క కాల్ షీట్ కి కోటి రూపాయలు వసూల్ చేస్తున్నారు కొంతమందిహీరోలు. ఇక హీరోయిన్లు అయితే.. ఒకేసారి మల్టిపుల్ మూవీస్ తో పాటు..

Star Heroes Income: హీరోల వందల కోట్ల సంపాదన.. డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలుసా?

Star Heroes Income

Star Heroes Income: ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు. అంతేకాదు.. రోజుకి అంటే ఒక్క కాల్ షీట్ కి కోటి రూపాయలు వసూల్ చేస్తున్నారు కొంతమందిహీరోలు. ఇక హీరోయిన్లు అయితే.. ఒకేసారి మల్టిపుల్ మూవీస్ తో పాటు బ్రాండ్ ఓపెనింగ్స్ కి కూడా మినిమం కోటి తీసుకుంటున్నారు. ఇలా కోట్లకు కోట్లు డబ్బులు.. సినిమాలతో వచ్చే డబ్బులే కాదు.. యాడ్లు, టీవీ షోలు.. ఇలా రకరకాలుగా డబ్బులు సంపాదిస్తూంటారు మన స్టార్లు. ఇంతకీ ఈ కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు..? అసలెలా ఖర్చుపెడుతున్నారు..? ఎక్కడ దాచిపెడుతున్నారు..? అసలు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో చూద్దాం.

Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!

ఒక్క సినిమాకి రెమ్యూనరేషన్ కోట్లలో తీసుకుంటారు మన స్టార్లు. కొంతమందైతే.. రోజుకి కోటి రూపాయలు వసూల్ చేస్తారు. వీటితో పాటు.. యాడ్స్, బ్రాండ్స్ ని ప్రమోట్ చేసినందుకు.. పై డబ్బులు కోట్లకు కోట్లు రానే వస్తాయి. మరి ఈ కోట్ల రూపాయల డబ్బులన్నీ స్టార్లు ఏం చేస్తారని డౌట్లు రావడం కామన్. ఒకప్పుడు స్టూడియోలు, రియల్ ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్ చేసే స్టార్లు.. ఇప్పుడు ట్రెండ్ కి తగినట్టు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

టాలీవుడ్ లో 100 కోట్లకు పైగా హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్.. తన ఇన్ కమ్ ని ఒకే చోట కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కోట్ల రెమ్యూనరేషన్ ని మూవీ ప్రొడక్షన్ కి మేజర్ గా స్పెండ్ చేస్తున్నారు. తన పెదనాన్న గోపీ కృష్ణ ప్రొడక్షన్స్ తోపాటు, యు.వి క్రియేషన్స్ లో మేజర్ షేర్ ఖర్చు పెడుతున్నారు ప్రభాస్. అంతేకాదు.. ధియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగిన ప్రభాస్.. సొంత బాహుబలి మల్టిపుల్ ధియేటర్లతో పాటు.. రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ వరకూ సినిమాకి 50 కోట్లుతీసుకునే పవర్ స్టార్.. ఇప్పుడు సినిమానికి 60 కోట్లు తీసుకుంటున్నారు. అంతే కాదు.. కాల్ షీట్ కి కోటి నుంచి రెండు కోట్లు ప్రైస్ ఫిక్స్ చేసిన ఈ హీరో.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా.. ఎక్కడా ఇన్వెస్ట్ చెయ్యడం లేదు. ప్రజెంట్ తనకున్న జనసేన పార్టీని మెయింటెన్ చెయ్యడానికి తన రెమ్యూనరేషన్ మొత్తం స్పెండ్ చేస్తున్నారు ఈ జనసేనాని.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎన్నికోట్లు సంపాదించినా.. నమ్రత వాటన్నింటినీ తెలివిగా ఇన్వెస్ట్ చేసేస్తూనే ఉంటుంది. మహేష్ బాబు తన 50 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్, క్లాతింగ్ బ్రాండ్, టాప్ బ్రాండిగ్ యాడ్స్ తో సంపాదించే డబ్బంతా.. మేజర్ ప్రొడక్షన్ కే స్పెండ్ చేస్తున్నారు. తన మహేష్ బాబు ప్రొడక్షన్స్ తో సినిమాలు చేస్తున్న మహేష్ బాబు.. రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. అటు సినిమాల మీద ఫోకస్ చేస్తూనే మరో వైపు ధియేటర్ల బిజినెస్ ని కూడా సూపర్బ్ గా రన్ చేస్తున్నారు. మెస్ట్ లావిష్ క్యాంపస్ తో పాటు లగ్జరీ థియేటర్లు మహేష్ బాబు సొంతం. ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబుకి గచ్చిబౌలిలో ఉన్న AMB మల్టీప్లెక్స్ స్టార్ సెలబ్రిటీస్ మూవీ అడ్డాగా మారిపోయింది.