Youtube Channel: యూట్యూబ్ వ్యూస్ కోసం సూసైడ్ చేసుకున్న స్టూడెంట్

యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూయర్స్ తగ్గిపోతున్నారనే బెంగతో 23ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IIITM గ్వాలియర్ లో చదువుతున్న వ్యక్తి.. తాను ఉంటున్న బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి గురువారం ఉదయం దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Youtube Channel: యూట్యూబ్ వ్యూస్ కోసం సూసైడ్ చేసుకున్న స్టూడెంట్

dead body

Updated On : July 22, 2022 / 9:44 AM IST

 

Youtube Channel: యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూయర్స్ తగ్గిపోతున్నారనే బెంగతో 23ఏళ్ల స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. IIITM గ్వాలియర్ లో చదువుతున్న వ్యక్తి.. తాను ఉంటున్న బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి గురువారం ఉదయం దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సూసైడ్ నోట్ రాసిన స్టూడెంట్.. అతని యూట్యూబ్ ఛానెల్ లో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని భావించాడు. అతను డిస్టర్డ్ గా ఉన్నాడని పేరెంట్స్ కూడా పట్టించుకోలేదు. అందుకే ఇలా చేస్తున్నానని రాసుకుని మృతి చెందినట్లు సైదాబాద్ పోలీసులు వెల్లడించారు.

అక్కడే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు చెప్పేవాడని స్థానికులు వెల్లడించారు. అతని యూట్యూబ్ ఛానెల్ లో వీడియో గేమ్స్ కంటెంట్ అప్ లోడ్ చేసేవాడని తెలుస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also: సూసైడ్‌కు యత్నించిన లవర్స్, చివర్లో ట్విస్ట్