Sudigali Sudheer : పెదనాన్న అయిన సుధీర్.. నీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు..

 జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఢీ షోలతో పాటు మరిన్ని షోలలో కమెడియన్ గా, యాంకర్ గా చేస్తూ బుల్లితెర..................

Sudigali Sudheer : పెదనాన్న అయిన సుధీర్.. నీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు..

Sudheer

Sudigali Sudheer :  జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఢీ షోలతో పాటు మరిన్ని షోలలో కమెడియన్ గా, యాంకర్ గా చేస్తూ బుల్లితెర మెగాస్టార్ గా ఎదిగాడు. సినిమా హీరోలకి ఉన్నంత ఫాన్స్ సుధీర్ కి ఉంటారు. ఎంతో కష్టపడి పైకి ఎదిగిన సుధీర్ పేరు, డబ్బులు బాగానే సంపాదించాడు. అయితే ఇటీవల జబర్దస్త్, ఢీ లాంటి షోలన్ని వదిలేసి మరో ఛానల్ కి షిఫ్ట్ అయ్యాడు. దీంతో సుధీర్ అభిమానులు నిరాశ చెందారు.

ఇక సుధీర్ ఎన్ని సాధించినా అందరూ అడిగేది ఒకటే సుధీర్ పెళ్లి ఎప్పుడు అని. 35 ఏళ్ళు వచ్చినా సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు సుధీర్ పెళ్లి ఎప్పుడు అని ప్రతి సారి అడుగుతారు. అయితే సుధీర్ తమ్ముడు మాత్రం గతంలోనే పెళ్లి చేసుకున్నాడు.

F3 Movie : కుర్రాడు బాబోయ్.. స్టేజిపై స్టెప్పులేసిన వెంకటేష్, వరుణ్, అనిల్ రావిపూడి..

తాజాగా సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రయ్యాడు. రోహన్ భార్య ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సుధీర్ పెదనాన్న అయ్యాడు అంటూ సంతోషిస్తున్నాడంట. ఈ విషయం తెలిసి సుధీర్ అభిమానులంతా మీ తమ్ముడు తండ్రి అయిపోయాడు నువ్వెప్పుడూ పెళ్లి చేసుకుంటావు అని సుధీర్ ని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మరి సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.